Share News

CV Anand: హైదరాబాద్‌ సీపీ డీపీతో వాట్సాప్‌ కాల్స్‌

ABN , Publish Date - Nov 09 , 2024 | 04:05 AM

డిజిటల్‌ అరెస్టుల పేరిట నయా దందాకు తెరలేపిన సైబర్‌ మాయగాళ్లు.. జనాన్ని భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. పోలీసు అధికారుల చిత్రాలను డిస్‌ప్లే పిక్చర్‌(డీపీ)గా పెట్టుకుని వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ జనాన్ని బురిడి కొట్టించాలని చూస్తున్నారు.

CV Anand: హైదరాబాద్‌ సీపీ డీపీతో వాట్సాప్‌ కాల్స్‌

  • సైబర్‌ కేటుగాళ్ల నయా ఎత్తుగడ

  • అలాంటి కాల్స్‌కు స్పందించకండి : సీపీ సీవీ ఆనంద్‌ సూచన

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ అరెస్టుల పేరిట నయా దందాకు తెరలేపిన సైబర్‌ మాయగాళ్లు.. జనాన్ని భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. పోలీసు అధికారుల చిత్రాలను డిస్‌ప్లే పిక్చర్‌(డీపీ)గా పెట్టుకుని వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ జనాన్ని బురిడి కొట్టించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన పలువురికి నగర పోలీసు కమిషనర్‌(సీపీ) సీవీ ఆనంద్‌ చిత్రం డీపీగా ఉన్న వాట్సాప్‌ నెంబర్‌ నుంచి శుక్రవారం కాల్స్‌ వచ్చాయి. ఆ ఫోన్‌ నెంబర్‌ పాకిస్థాన్‌ కంట్రీ కోడ్‌(+92)తో ప్రారంభం కావడం గమనార్హం.


భారతదేశ నెంబర్లు +91 కంట్రీ కోడ్‌తో ప్రారంభమవుతాయి. కాగా, సీపీ చిత్రం డీపీగా ఉండడం, ఫోన్‌ నెంబర్‌ అనుమానాస్పదంగా ఉండడంతో ఆ కాల్స్‌కు స్పందించని కొందరు విషయాన్ని సైబర్‌ క్రైమ్‌తోపాటు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన సీపీ సీవీ ఆనంద్‌.. తన ఫొటో డీపీగా ఉన్న నెంబర్‌ నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని, సైబర్‌ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన చేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930, డయల్‌-100/122 నంబర్‌లకు ఫోన్‌ చేసి పోలీసులను సంప్రదించాలని కోరారు.

Updated Date - Nov 09 , 2024 | 04:06 AM