Kingfisher Beer: కింగ్‌ఫిషర్ బీర్లు దొరకట్లేదు.. ఆదుకోండి మహాప్రభో!!
ABN , Publish Date - Apr 29 , 2024 | 05:15 PM
వేసవి కాలంలో మందుబాబులు బీర్లు (Beers) తాగడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ముచ్చెమటలు పట్టించే ఈ వేడి వాతావరణంలో చల్లని బీర్లు తాగితే.. హాయిగా ఉంటుందని వాళ్లు భావిస్తారు. అందుకే.. వేసవిలో బీర్ల కోసం మద్యం షాపుల ముందు క్యూ కట్టేస్తారు.
వేసవి కాలంలో మందుబాబులు బీర్లు (Beers) తాగడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ముచ్చెమటలు పట్టించే ఈ వేడి వాతావరణంలో చల్లని బీర్లు తాగితే.. హాయిగా ఉంటుందని వాళ్లు భావిస్తారు. అందుకే.. వేసవిలో బీర్ల కోసం మద్యం షాపుల ముందు క్యూ కట్టేస్తారు. బహుశా ఇలా ఎగబడటం వల్లనో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ.. ఈ వేసవిలో కింగ్‌ఫిషర్ (Kingfisher) లైట్ బీర్లు పెద్దగా అందుబాటులో లేవు. తెలంగాణ రాష్ట్రంలో వాటి కొరత ఏర్పడింది. ఎక్కడో కొన్ని షాపుల్లో మాత్రమే కొద్దిమొత్తంలో దొరుకుతుంటే.. మిగతా షాపుల్లో మాత్రం లేవు. ఈ నేపథ్యంలోనే మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టుని ప్రకటించిన చిన్నారులు.. వీడియో వైరల్
ఈ బీర్ల కొరతపై మంచిర్యాలలోని తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. సరిపడా బీర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. వ్యాపారులే బీర్ల కొరతను సృష్టిస్తున్నారని.. ఖరీదైన బీర్ల విక్రయాల్ని పెంచుకోవడం కోసమే లైట్ బీర్లను మార్కెట్‌లోకి తీసుకురావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. బీర్ల కొరతను సృష్టిస్తున్న వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి లైట్ బీర్లను అమ్మడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడంలో మందుబాబుల పాత్ర ఎంతో కీలకమైందని, అలాంటి తమను ఆదుకోవాలని, కింగ్‌ఫిషర్ లైట్ బీర్లను అందుబాటులోకి తేవాలని కోరారు.
అతడ్ని బెంచ్‌కే పరిమితం చేస్తే.. అంతకంటే ఘోర అన్యాయం ఇంకోటి ఉండదు
కొన్ని రోజులుగా మంచిర్యాలలో కేఎఫ్ లైట్ బీర్లు ఏ షాప్‌లో గానీ, బార్లలో గానీ లభ్యం కావడం లేదని.. దీంతో ఈ మండుటెండల్లో దాహం తీర్చుకోవడానికి జనాలు ఇబ్బందులకు గురవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తలనొప్పి, వాంతులు వస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయని.. కాబట్టి వైన్ షాప్స్, బార్లలో లైట్ బీర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరి తరఫున తాను కోరుతున్నానని ఆ అధ్యక్షుడు చెప్పారు. ఈ విషయంలో తమకు సహకరిస్తే.. రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో తాము కృషి చేస్తామని తెలియజేశారు.
సచిన్‌లాగే విరాట్ కోహ్లీ వెనక్కు తగ్గాల్సిందే.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుండగా.. కొన్ని రోజుల క్రితమే సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో బీర్ల విషయమై పెద్ద గొడవ జరిగిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ వైన్ షాప్‌లో బీర్లు లేవని చెప్పినందుకు, మద్యం ప్రియులు ఆందోళన చేపట్టారు. వారిని సముదాయించేందుకు ఏకంగా పోలీసులు రంగంలోకి దిగారంటే, వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. చివరికి పోలీసులపైనే వారు చెయ్యి చేసుకునే స్టేజ్‌కి గొడవ చేరింది. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. సుమారు గంటసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి మందుబాబుల్ని స్టేషన్‌కి తీసుకెళ్లి.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, తిరిగి ఇంటికి పంపించారు.
Read Latest Telangana News and Telugu News