Share News

Hyderabad: హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ముంబై రైలు ఎక్కారు..

ABN , Publish Date - Sep 03 , 2024 | 09:38 AM

హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేని ముగ్గురు బాలికలు కలిసి ముంబై(Mumbai) వెళ్లేందుకు రైలు ఎక్కారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాలాపత్తర్‌ పోలీసులు(Kalapattar Police) గంటల వ్యవధిలో బాలికలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Hyderabad: హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ముంబై రైలు ఎక్కారు..

- ముగ్గురు బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన కాలాపత్తర్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేని ముగ్గురు బాలికలు కలిసి ముంబై(Mumbai) వెళ్లేందుకు రైలు ఎక్కారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాలాపత్తర్‌ పోలీసులు(Kalapattar Police) గంటల వ్యవధిలో బాలికలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన బాలిక(14), 7వ తరగతి పూర్తి చేసింది. బాలికను హాస్టల్‌కు పంపుతామని తల్లి పలుమార్లు చెప్పింది. ఇదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మరో కుటుంబంలో ఇద్దరు బాలికలను కూడా వారి తల్లిదండ్రులు హాస్టల్‌కు పంపుతామని చెప్పారు. హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేని ముగ్గురు బాలికలు కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబైకి వెళ్దామని పథకం వేసుకున్నారు.

ఇదికూడా చదవండి: Khammam: కొణిజర్ల కేజీబీవీ గోడల నుంచి విద్యుత్‌ షాక్‌


సోమవారం ఎవరికీ చెప్పకుండా ఇళ్ల నుంచి బయలుదేరారు. బాలికలు కనిపించకపోవడంతో గాబరాపడ్డ తల్లిదండ్రులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాలాపత్తర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ముగ్గురు బాలికలు నాంపల్లి రైల్వేస్టేషన్‌(Nampally Railway Station)లో ముంబై వెళ్తున్న రైలులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.


.................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.................................................................

MP Eatala: వరదల్లో మరణించిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

- ఎంపీ ఈటల రాజేందర్‌

మల్కాజిగిరి(సికింద్రాబాద్): ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరదల్లో మరణించిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తక్షణమే రూ. 50లక్షల నష్టపరిహారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లు, బ్రిడ్జీలను తక్షణమే ఉపయోగంలోకి తేవాలని కోరారు. నిర్వాసితులకు వరదసహాయక కేంద్రాల్లో అన్ని వసతులతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

city2.jpg


వరద తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రభుత్వం నష్టపోయిన పంటపొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యఆరోగ్య సిబ్బంది అవసరం మేరకు మందులను అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2024 | 09:38 AM