Allu Arjun: కోర్టులో అల్లు అర్జున్ హాజరు.. న్యాయమూర్తి సంచలన ఆదేశాలు..
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:34 PM
అల్లు అర్జున్‌కు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనకు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్‌పై వాదనలు న్యాయమూర్తి ఇప్పుడు వింటారా.. మరోసారి వాదనలు వినిపించమంటారా అనేది తెలియాల్సిఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం..
సంథ్య థియేటర్‌లో పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో హీరో అల్లు అర్జున్, సినిమా యూనిట్‌తో పాటు సంథ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చారు. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా అల్లు అర్జున్ ఉండనున్నారు. అల్లు అర్జున్‌కు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనకు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్‌పై వాదనలు న్యాయమూర్తి ఇప్పుడు వింటారా.. మరోసారి వాదనలు వినిపించమంటారా అనేది తెలియాల్సిఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. అల్లు అర్జున్‌ను ఈ కేసులో తదుపరి విచారణ కోసం పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
హైకోర్టులో క్వాష్ పిటిషన్
ఓ వైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపర్చగా మరోెవైపు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం కేసు విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. కేసును క్వాష్ చేయాలని న్యాయవాదులు వాదించనున్నారు. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం ప్రకారం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఆధారంగా అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం 4గంటలకు క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పోలీసుల అరెస్ట్ విధానంపై కూడా విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
బెయిల్ వస్తుందా..
అల్లు అర్జున్‌కు ఈరోజు బెయిల్ వస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇవాళ బెయిల్ వచ్చే అవకాశాలు లేనట్లు కనిపిస్తోంది. హైకోర్టులో నేరుగా బెయిల్ పిటిషన్ వేసే అవకాశం లేదు. ట్రయల్ కోర్టు బెయిల్ రిజక్ట్ చేసినప్పుడు మాత్రమే హైకోర్టును సంప్రదించాల్సి ఉంటుంది. క్వాష్ పిటిషన్‌పై విచారణ తర్వాత కేసును కొట్టివేస్తే అల్లు అర్జున్ వెంటనే విడుదలవుతారు. ఒకవేళ కోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తే మాత్రం ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here