KTR: వాస్తవాలు చెప్పేందుకే ‘చలో మేడిగడ్డ’
ABN , Publish Date - Mar 01 , 2024 | 10:00 AM
Telangana: బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ’’ పర్యటన అని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదని... రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలన్నారు.
హైదరాబాద్, మార్చి 1: బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Leader KTR) విమర్శలు గుప్పించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ’’ పర్యటన అని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదని... రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలన్నారు. ఈరోజు చేస్తున్నది మొదటి పర్యటన మాత్రమే అని.. తర్వాత అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామన్నారు. రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటని.. భాద్యులపై చర్యలు తీసుకోవాలని.. రైతులను బలి చేయొద్దని కోరారు. రిపేర్ చేయకుండా ఉంటే వర్ష కాలంలో వరద వస్తే బరేజ్ కొట్టుకపోవాలి చూస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.
నేడు బీఆర్‌ఎస్ ‘చలో మేడిగడ్డ’
రైతులను పణంగా పెట్టొద్దు: పోచారం
ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పుకొచ్చారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతు నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమమన్నారు. బీమా, నేటం పాడు ప్రాజెక్టులు పూర్తి చేసి వలసలు ఆపేశామన్నారు. 86 పిలర్లలో 3 పిలర్లు కుంగాయని.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులో కూడా సాంకేతిక లోపాలు ఉంటాయి సరిదిద్దుకోవాలని సూచించారు. కాళేశ్వరంలో మొత్తం196 స్కీం ఉన్నాయని.. మూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారని మండిపడ్డారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్న తామెన్నడూ బ్లేమ్ చేయలేదన్నారు. కడియం ప్రాజెక్టు రెండు మార్లు తెగిందని.. అలా అని ఇప్పుడు మేడిగడ్డ కేవలం కుంగింది తెగలేదన్నారు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను పణంగా పెట్టవద్దని హితవుపలికారు. రైతు ప్రయోజనాలకు అడ్డుపడొద్దని డిమాండ్ చేశారు. వచ్చే వర్ష కాలం కల్లా సుందిళ్ళ, అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లో నీటిని నింపాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే నష్టం తమకే అని చెప్పుకొచ్చారు. గతంలో 40 ఏండ్లు అయిన ఒక్కో దగ్గర ప్రాజెక్టులు పూర్తి కాలేదు కానీ కాళేశ్వరం మూడు ఏండ్లలో పూర్తి చేశామన్నారు. రైతుబందు గతి లేదు ఇప్పటికి మూడు సార్లు పెండింగ్‌లో పెట్టారని పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
KTR: తెలంగాణను కన్నీటి సాగుకు కేరాఫ్‌గా మారిస్తే సహించేదిలే..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...