Share News

CM Revanth Reddy: తెలంగాణలో క్రీడల అభివృద్ధిపై కేంద్రమంత్రితో రేవంత్ భేటీ..

ABN , Publish Date - Aug 23 , 2024 | 07:43 PM

ఒలింపిక్స్‌, ఆసియ‌న్, కామ‌న్‌వెల్త్ గేమ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడలు తెలంగాణ‌ రాష్ట్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనుసుఖ్ మాండ‌వీయ‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌-2025కు హైద‌రాబాద్‌ను వేదిక చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

CM Revanth Reddy: తెలంగాణలో క్రీడల అభివృద్ధిపై కేంద్రమంత్రితో రేవంత్ భేటీ..

ఢిల్లీ: ఒలింపిక్స్‌, ఆసియ‌న్, కామ‌న్‌వెల్త్ గేమ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడలు తెలంగాణ‌ రాష్ట్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనుసుఖ్ మాండ‌వీయ‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌-2025కు హైద‌రాబాద్‌ను వేదిక చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి మనుసుఖ్ మాండవీయాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో కలిసి సీఎం భేటీ అయ్యారు.


అన్నీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి..

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. జాతీయ, అంత‌ర్జాతీయ క్రీడ‌లు నిర్వహణకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు తెలంగాణ‌లో ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు తెలిపారు. హైద‌రాబాద్‌లోని స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల్లో అంత‌ర్జాతీయ‌ ప్రమాణాలతో కూడిన ఈత కొల‌నులు, మ‌ల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్స్, ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌, స్కేటింగ్ ట్రాక్స్‌, వాట‌ర్ స్పోర్ట్స్‌, ఇత‌ర క్రీడ‌ల‌కు సంబంధించీ వ‌స‌తులు ఉన్నాయ‌ని సీఎం వివరించారు. 2002లో నేష‌న‌ల్ గేమ్స్‌, 2003లో ఆఫ్రో-ఏషియ‌న్ గేమ్స్‌, 2007లో ప్రపంచ మిల‌ట‌రీ గేమ్స్ హైద‌రాబాద్‌ వేదికగా జరిగిన విష‌యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.


నిధులు ఇవ్వండి..

తెలంగాణలో యువ‌త క్రీడా నైపుణ్యాల‌ు వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీల్లో క్రీడ‌ల‌కు సంబంధించిన అన్నీ ర‌కాల శిక్షణ, ప‌రిశోధ‌న‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయనకు చెప్పారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ఆర్థికసాయం అంద‌జేయాల‌ని మాండవీయను కోరారు. క్రీడా వ‌స‌తుల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా ప‌థ‌కం కింద విడుద‌ల చేసే నిధుల మొత్తాన్ని తెలంగాణకు పెంచాల‌ని విన్నవించారు. జీఎంసీ బాల‌యోగి స్టేడియం, షూటింగ్ రేంజ్‌, ఎల్బీ స్టేడియం, హ‌కీంపేట‌లోని స్పోర్ట్స్ స్కూల్‌, స‌రూర్ న‌గ‌ర్ ఇండోర్ స్టేడియం అభివృద్ధికి స‌మ‌ర్పించిన డీపీఆర్‌ల‌ను ఆమోదించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Tummala: రుణమాఫీ పథకం-2024పై మంత్రి తుమ్మల సమీక్ష..

CM Revanth Reddy: టీ-ఫైబర్‌ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి..

Hyderabad: ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద మహాధర్నాకు పిలుపు..

Updated Date - Aug 23 , 2024 | 08:15 PM