Share News

CM Revanth Reddy: నేడు విజయవాడ వెళ్లనున్న సీఎం రేవంత్

ABN , Publish Date - Jul 08 , 2024 | 08:01 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విజయవాడకు వెళ్లనున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరగనున్న వైఎస్సార్ జయంతి సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు వెళ్లనున్నారు.

CM Revanth Reddy: నేడు విజయవాడ వెళ్లనున్న సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం విజయవాడకు వెళ్లనున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఆధ్వర్యంలో జరగనున్న వైఎస్సార్ జయంతి సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YSR) 75వ జయంతి (75th Anniversary) కార్యక్రమానికి రేవంత్‌ హాజరవుతున్నారు. వైఎస్‌ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో.. వైఎస్ఆర్‌ అభిమానగణాన్ని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ మొదలుపెట్టింది. అందులో భాగంగా వైఎస్ఆర్‌ జయంతిని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ వైఎస్ఆర్‌ జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇటు ప్రజాభవన్‌లో, అటు గాంధీభవన్‌లో కార్యక్రమాలు తలపెట్టింది. ప్రజాభవన్‌లో వైఎస్ఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.


సోమవారం ఉదయం.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు పంజగుట్టలోని వైఎస్ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్‌కు వెళ్లి.. అక్కడ వైఎస్ఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత గాంధీభవన్‌కు చేరుకుని అక్కడ వైఎస్ఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్నీ సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి వైఎస్ఆర్‌ జయంతి వేడుకలు జరిగే మంగళగిరికి రోడ్డుమార్గంలో చేరుకోనున్నారు. సీఎం రేవంత్‌ వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతోపాటు పలువురు మంత్రలు, ముఖ్యనేతలు కూడా విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఏకకాలంలో జగన్‌, షర్మిల నివాళులు

వైఎస్ఆర్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ వద్ద సోమవారం ఉదయ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఏకకాలంలో నివాళులర్పించనున్నారు. ఇటీవల జగన్‌, షర్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాక ఇద్దరూ ఒకే సమయంలో ఇడుపులపాయలో వైఎస్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ, ఈసారి ఇద్దరూ ఒకే సమయంలో నివాళులర్పించనున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యే పదవికి జగన్‌ రాజీనామా?

అదానీ కోసం దోచిపెట్టారు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 08 , 2024 | 08:04 AM