ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hanumantha Rao: సకలజనుల సర్వే రిపోర్ట్‌ను కేసీఆర్ వెంటనే బయట పెట్టాలి: వీహెచ్

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:31 PM

కేసీఆర్ ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది..కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. సకలజనుల రిపోర్ట్ ఎక్కడకి పోయిందని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను నిలదీశారు.

V. Hanumantha Rao

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం సకలజనుల సర్వే చేసింది..కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V. Hanumantha Rao) ప్రశ్నించారు. సకలజనుల రిపోర్ట్ ఎక్కడకి పోయిందని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లను నిలదీశారు. ఈరోజు(మంగళవారం) గాంధీభన్‌లో వి.హనుమంతరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ... బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని వి.హనుమంతరావు కోరారు.


ALSO READ: CM Revanth Reddy: దేశంలోనే తెలంగాణ యంగెస్ట్.. ది ఫ్యూచర్ స్టేట్

మూడు నెలల లోపుల కులగణన రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన బిల్లుని తెలంగాణ అసెంబ్లీలో పెట్టారని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి.. బీసీ కులగణన చేయాలని చెప్పారని వి.హనుమంతరావు అన్నారు. సకలజనుల రిపోర్ట్‌ని కేసీఆర్ తెలంగాణ ఛీప్ సెక్రటరీకి ఇవ్వాలని వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.


ALSO READ: Raghunandan: నేను ఎవరికీ వత్తాసు పలకను.... దేశం కోసమే మాట్లాడతా

సకలజనుల రిపోర్ట్ ఇస్తే బీసీ కులగణనకి ఊయోగపడుతుందని అన్నారు. బీసీ కమిషన్ కూడా రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. 90% ఉన్న ప్రజలకి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ. 150 కోట్లు విడుదల చేస్తే రెండు నెలల్లోనే బీసీ కులగణన రిపోర్ట్ వస్తుందని వి.హనుమంతరావు స్పష్టం చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కి చిత్తశుద్ది ఉంటే సకలజనుల రిపోర్ట్ బయట పెట్టాలని అడిగారు. బీసీ కులగణన పూర్తి అయ్యాక సర్పంచ్ ఎన్నికలు వస్తే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని వి.హనుమంతరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Hyderabad: మరుగుదొడ్డే ఆమె ఇల్లు.. వృద్ధురాలి దీనగాధ..

CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు

Danam Nagender: బీఆర్ఎస్ చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?: దానం నాగేందర్

CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..

Viral Video: వామ్మో.. పిల్లలు ఇలా తయారయ్యారేంటి? స్కూటీ పక్కకు తీయాలని చెప్పి కీస్ తీసుకుని ఓ బాలిక ఏం చేసిందో చూడండి..!

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 10 , 2024 | 03:38 PM

Advertising
Advertising