Wine Shops: శ్రీరామ నవమి సందర్భంగా వైన్ షాపులు బంద్
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:56 PM
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా జంట నగరాల్లో వైన్ షాపులు మూసివేస్తారు. 12 గంటల పాటు మార్కెట్లో మందు లభ్యం కాదు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు..

రేపు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా వైన్ షాపులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 6న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జంట నగరాల్లో రేపు 12 గంటల పాటు వైన్ షాపులు బంద్ అయి ఉంటాయి. అటు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు కూడా మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెస్టారెంట్లలోని బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని అందరూ గమనించి సహకరించాలని పోలీసులు కోరారు. అయితే, ఫైవ్ స్టార్ హోటళ్లు, రిజిష్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉంది.
ఇవి కూడా చదవండి
Trump Tariffs Impact: మార్కెట్ ట్రంఫట్
Reduced Gold Rate: పసిడి ప్రియులకు తీపి కబురు.. తగ్గిన బంగారం ధర
Read Latest Business News And Telugu News