Share News

Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:37 PM

సెల్‏ఫోన్ మరొకరి ప్రాణం తీసింది. ఫోన్‏లో ఎక్కువగా మాట్లాడుతున్నావంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..

హైదరాబాద్: ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడవద్దని కుటుంబ సభ్యులు మందలించినందుకు జాశ్విని(13) ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Jawaharnagar Police Station) పరిధిలోని గిరిప్రసాద్‌నగర్‌ కాలనీలో జరిగింది. ఎస్‌హెచ్‌ఓ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గిరిప్రసాద్‌నగర్‌ కాలనీలో ఉంటున్న ఇటుకాల హరి, రేణుక భార్యాభర్తలు. వీరికి కూమార్తె జాశ్విని, ఓ కుమారుడు ఉన్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: ఉనికిని కాపాడుకోవడానికే టూరిస్టు రాజకీయాలు..


హరి రామగుండం విద్యుత్‌ సంస్థలో రోజు వారి కూలీ. జాశ్విని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేది. తల్లి రేణుకా పనికి వెళ్లిన సమయంలో బాలిక సోషల్‌ మీడియాలో స్నేహితులతో తరుచుగా ఛాటింగ్‌ చేస్తుండేదని తెలిపారు. ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడవద్దని ఇటీవల కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు మందలిస్తూ చెప్పారు. దీంతో జాశ్విని నాలుగు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది. ఈనెల 3న తల్లి పని కోసం బయటకు వెళ్లగా, అవమానంగా భావించిన జాశ్విని(Jashwini) ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.


city8.2.jpg

ఇంటికి వచ్చిన తల్లి తలుపులను చూడగా, ముందు భాగం మూసివేసి ఉండడంతో వెనుక నుంచి ఇంట్లోకి వెళ్లి చూడగా కుమార్తే మృతి చెంది ఉంది. జాశ్విని ఫోన్‌ చూడగా వీరా అనే వ్యక్తితో ఛాటింగ్‌ చేసిన ట్టు గమనించారు. పక్కనే ఉన్న నోట్‌ బుక్‌ను పరిశీలించగా బోస్‌ ఐ లవ్‌ యూ, వీరా ఐ లవ్‌యూ, మిస్‌ యూ, గుడ్‌ డే, రామ్‌ గుడ్‌ బై అని రాసి ఉంది. శుక్రవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌హెచ్‌ఓ సైదయ్య తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చెడగొట్టు వానకు రైతు విలవిల!

ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2025 | 12:37 PM