KTR: కాళేశ్వరాన్ని ఏదైనా చేస్తారేమో.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jul 27 , 2024 | 08:31 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఢిల్లీ వెళ్లి అక్కడ వరుస సమీక్షలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram project) గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఢిల్లీ వెళ్లి అక్కడ వరుస సమీక్షలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రాజెక్ట్‌ల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఎండగట్టారు. కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టారని, ఇది పూర్తి చేయడానికి రూ.1.47 లక్షల కోట్లు అవసరమని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సందర్శించారు. అనంతరం హైదరాబాద్ వచ్చిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ వారే ఏమైనా చేశారేమోననే అనుమానం ఉందని అన్నారు.
లక్ష కోట్లు అని బద్నాం చేస్తున్నారు..
మేడిగడ్డ 28 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిందని తెలిపారు. ఏ వరద లేనప్పుడు ప్రాజెక్టు ఎలా కుంగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును దెబ్బతీశారని తనకు ఎప్పటినుంచో అనుమానం ఉందని స్పష్టంచేశారు. రేపు ప్రాజెక్టుకు ఏదైనా జరగకూడనిది జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. కాళేశ్వరాన్ని ఏదైనా చేస్తారనే అనుమానం కూడా ఉందని తెలిపారు. NDSA రిపోర్ట్ బీజేపీ కార్యాలయంలో తయారు చేసిందేనని విమర్శించారు. లక్ష కోట్లతో కాళేశ్వరం అని తమను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. మరి లక్షన్నర కోట్లతో మూసి కడితే ఎవరికి లాభమని నిలదీశారు. మెట్రో అలైన్‌మెంట్‌ను ఎంఐఎం పార్టీ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ ఎల్ అండ్ టీ లాంటి సంస్థను జైల్‌లో పెడతామంటే ఏ సంస్థ అయినా రాష్ట్రానికి వస్తుందా అని ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ లాంటి సంస్థపై రేవంత్ మాట్లాడి పెట్టుబడి దారులకు చాలా తప్పుడు సంకేతాలు ఇచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డికి షాడో కేబినెట్..
తాము TOT పద్ధతిలో అవుటర్ లీజ్ ఇచ్చామని చెప్పారు. రూ. 7400 కోట్లు కట్టి వాపస్ తీసుకుంటే తాము వద్దు అంటున్నామా? అని అడిగారు. కేన్సర్, ఎయిడ్స్ రోగితో రాష్ట్రాన్ని పోల్చుతారా? సీఎం రేవంత్‌రెడ్డికు ఇదేం బుద్ధి హీనత అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి షాడో కేబినెట్ ఉందని ఆరోపించారు. ఫయుమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఉదయ్ సింహతో షాడో కేబినెట్ నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఫయుమ్ ఖురేషి సెటిల్ మెంట్‌లు చేస్తున్నారని విమర్శించారు. ధరణిలో మార్పులు రాగానే సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల్ రెడ్డి , తిరుపతి రెడ్డి ఆగడాలు మొదలవుతాయని ఆరోపించారు. భూమాత భూ మేతగా మారుతుందని ఎద్దేవా చేశారు. ధరణి భూమాతగా మారగానే రేవంత్ సోదరుల ఆగడాలు మొదలవుతాయని అన్నారు. ఎవరేం చేస్తున్నారో అన్ని వివరాలు తమకు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth: హరీష్‌రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ గట్టి కౌంటర్
Bandi Sanjay: కాళేశ్వరం వెళ్లి ఏం సాధించావ్ కేటీఆర్..
Damodara Rajanarasimha: 317 జీవోతో నష్టపోయిన వారి వివరాలివ్వండి
Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 27 , 2024 | 08:37 PM