KCR: రైతుల చెంతకు బయల్దేరిన కేసీఆర్.. ఫస్ట్ ఎక్కడికి వెళ్తారంటే
ABN , Publish Date - Mar 31 , 2024 | 11:34 AM
భూగర్భ జలాలు అడుగంటడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో పొట్ట దశలో ఉన్న పొలాలను కాపాడుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
ఎర్రవెల్లి: భూగర్భ జలాలు అడుగంటడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో పొట్ట దశలో ఉన్న పొలాలను కాపాడుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
వారిని పరామర్శించడానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బయల్దేరారు. ఆదివారం ఆయన ఉమ్మడి నల్లొండ జిల్లాలోని రైతులను పరామర్శించనున్నారు.
ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి క్షేత్రపర్యటనకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లోని కేసీఆర్ నివాసానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
అనంతరం అక్కడి నుంచి కేసీఆర్ బయల్దేరారు. ఆయన నేరుగా జనగాం జిల్లా దేవరుప్పలలోని దరావత్ తండాకు చేరుకోనున్నారు. అక్కడి రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.