Share News

Pawan Kalyan: కొత్త పుంతలు తొక్కిస్తోన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Apr 02 , 2025 | 08:29 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh) కొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఉపాధి హామీ పథకాన్ని మరింత నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది.

Pawan Kalyan: కొత్త పుంతలు తొక్కిస్తోన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
pawan kalyan

భారతదేశ గ్రామాల్లో వ్యవసాయ ఆదాయంతో పాటు పాడి పరిశ్రమ కీలక ఆర్థిక వనరుగా ఉంది. అయితే, రైతులు తమ పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీరు, గడ్డి అందించడంలో ప్రస్తుత కాలంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh) కొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ 12,500 నీటి తొట్టెల అవసరాన్ని గుర్తించింది.అంతేకాదు, వీటిని ఉపాధి హామీ నిధులతో నిర్మించ తలపెట్టారు. తద్వారా ఏపీలో రైతులకు భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల కోసం 12,500 నీటి తొట్టెల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ.56.25 కోట్ల నిధులను కేటాయించారు, ఈ నెల 15వ తేదీ నాటికి నిర్మాణ పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు.


ఈ ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వర్చువల్ సమావేశంలో అధికారులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని సూచించారు. ఈ వేసవిలోనే ఈ తొట్టెలు పూర్తిగా వినియోగంలోకి రావాలన్నారు. నిన్నచాలా ప్రాంతాల్లో నీటి తొట్టెల నిర్మాణానికి భూమి పూజలు జరిగాయి. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.45,000 వెచ్చిస్తారు. మొత్తంగా 25 లక్షల పశువులు, మూగజీవాలకు నీటిని అందించాలని నిర్దేశించారు. అందువల్ల ఈ ఎండాకాలం పశువులు.. నీటి కొరతతో ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఫలితంగా పాల ఉత్పత్తి కూడా బావుంటుంది. పలు జిల్లాల్లో అధికారులు స్థలాలను గుర్తించి, నిర్మాణ పనులను చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వేసవి తీవ్రత పెరిగేలోపు ఈ తొట్టెలు సిద్ధం కావడం ద్వారా పశుసంపద రక్షణలో ప్రభుత్వం తీసుకున్న చొరవగా ఇది కనిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..

Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి

Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు

Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్

For Latest National News , National News in Telugu

Updated Date - Apr 02 , 2025 | 08:42 AM