Hyderabad: కాల్పుల కలకలం.. రెండు రౌండ్లు గాలిలోకి..
ABN , Publish Date - Mar 30 , 2025 | 08:02 AM
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుడిమల్కాపూర్ కింగ్ ప్యాలెస్ ఫంక్షన్‌హాల్‌లో ఈ కాల్పుల ఘటన జరిగింది. దీనిపై పోలీస్ శాఖ అప్రమత్తమై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- నిందితులకు రిమాండ్
హైదరాబాద్: ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారడంతో మరోవ్యక్తి కాల్పులకు దిగాడు. ఈ సంఘటన గుడిమల్కాపూర్ కింగ్ ప్యాలెస్ ఫంక్షన్‌హాల్(Gudimalkapur King Palace Function Hall)లో శనివారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గుడిమల్కాపూర్ కింగ్ ప్యాలెస్ ఫంక్షన్‌హాల్‌లో కొద్ది రోజులుగా మీర్ అలీఖాన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే త్వరపడండి..
శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎగ్జిబిషన్‌లోని ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్తా పెద్దగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న మరో షాప్ ఓనర్ మీర్ అస్లాం ఉద్దీన్ అలియాస్ హైదర్ గొడవపడుతున్న వ్యక్తులు తన వద్దకు ఎక్కడ వస్తారో అన్న భయంతో లైసెన్సు రివాల్వర్‌తో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ ప్రాంతవాసులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ గొడవకు కారణమైన రెండు షాపుల నిర్వాహకులు, కాల్పులు జరిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదర్ గతంలో వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ రాగింట గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశాడని, ప్రస్తుతం లక్డీకాపూల్ ఏసీ గార్డ్స్‌లో నివసిస్తున్న ఇతనికి నాంపల్లి పోలీసులు(Nampally Police) రివాల్వర్ లైసెన్స్‌ను ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టెన్త్ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం
జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
Read Latest Telangana News and National News