Minister Ponguleti: మున్నేరు ప్రళయం దాటికి వేల కోట్ల నష్టం
ABN , Publish Date - Sep 02 , 2024 | 07:16 PM
జిల్లాలో ఎప్పుడో 85 ఏళ్ల క్రితం మున్నేరు వద్ద 35అడుగుల మేర ప్రవహించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మళ్లీ ఇప్పుడు 35అడుగులు మున్నేరు నీటి మట్టం దాటిందని చెప్పారు. మున్నేరు ప్రళయం దాటికి వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు.
ఖమ్మం జిల్లా: జిల్లాలో ఎప్పుడో 85 ఏళ్ల క్రితం మున్నేరు వద్ద 35అడుగుల మేర ప్రవహించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మళ్లీ ఇప్పుడు 35అడుగులు మున్నేరు నీటి మట్టం దాటిందని చెప్పారు. మున్నేరు ప్రళయం దాటికి వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం హెలికాప్టర్ తెప్పించే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు. వాతావరణం అనుకూలించక సాధ్యం కాలేదని తెలిపారు. ఈ వరదలకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.తక్షణ సహాయం కింద బాధిత కుటుంబాలకురూ. రూ. 10 వేలు ఇస్తున్నామని తెలిపారు. రాజకీయం చేయాలని తాను మాట్లాడటంలేదని చెప్పారు. వరదలను కూడా ప్రతిపక్ష పార్టీలు రాదంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. శవాల మీద పేలాలు ఎరుకున్నట్లు ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని విమర్శలు చేశారు.
వరదల్లో చిక్కుకున్న వారికి భరోసా ఉండాల్సింది పోయి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఇంత భారీ ఎత్తున మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహించలేదని చెప్పారు. చాతనైతే మంచి సూచనలు ఇవ్వండి రెచ్చగొట్టే ప్రయత్నం చెయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.
ఖమ్మం జిల్లాలో ఊహించలేని స్థాయిలో నష్టం: మంత్రి ఉత్తమ్
ఖమ్మం జిల్లాలో ఊహించలేని స్థాయిలో నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు నష్టం అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా కల్పించారు.
మున్నేరుకు ఈసారి కవినివి ఎరగని ప్రళయం: మంత్రి తుమ్మల
మున్నేరుకు ఈసారి కవినివి ఎరగని ప్రళయం వచ్చిపడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇది అనుకొని ఊహించని ఉప ద్రవమని తెలిపారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అతి తక్కువ సమయంలో 47సెం. మీ వర్ష పాతం ఖమ్మంలో కురిసిందని చెప్పారు. రెండంతస్తుల బిల్డింగ్లు కూడా నీట మునిగాయని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఏపీ నుంచి నేవి హెలికాప్టర్ తెచ్చే ప్రయత్నం చేశామని అన్నారు. కానీ వాతావరణం అనుకూలించ అది సాధ్యపడలేదని చెప్పారు.
దురదృష్టవశాత్తు పాలేరులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పేద కుటుంబాల గూడు చెదిరిందని అన్నారు. నష్టం తీవ్రత పెద్ద ఎత్తున ఉందని చెప్పారు. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, పెద్ద ఎత్తున కరెంట్ స్తంభాలు నేలకొరిగాయని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలు కుదట పడేవరకూ సహాయక చర్యల అందజేయాల్సి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.