BJP: కిషన్‌రెడ్డిపై అనుచిత వీడియోలు తొలగించాలి
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:07 AM
కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను పార్టీ నాయకులు కోరారు.
సైబర్ క్రైం పోలీసులకు బీజేపీ వినతి
పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం సైబర్ క్రైం డిప్యూటీ కమిషనర్ (డిటెక్టివ్ డిపార్టుమెంట్) శ్వేతకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాశ్‌రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తదితరులు వినతి పత్రం అందజేశారు.
కొంతమంది వ్యక్తులు కిషన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారని వారు ఫిర్యాదు చేశారు. సంబంధిత తప్పుడు వీడియోలను తక్షణం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో క్లిప్పింగ్‌లను డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు.