Mangalya : నార్సింగిలో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం..
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:19 AM
మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యం హైదరాబాద్‌లోని నార్సింగిలో 21వ స్టోర్‌ను ప్రారంభించింది. శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి సంయుక్త మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని.. జ్యోతి ప్రజ్వలన చేశారు.
ముఖ్యఅతిథిగా సందడి చేసిన సినీనటి సంయుక్త మీనన్
హైదరాబాద్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యం హైదరాబాద్‌లోని నార్సింగిలో 21వ స్టోర్‌ను ప్రారంభించింది. శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి సంయుక్త మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని.. జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్లోని పట్టు, ఫ్యాన్సీ చీరల సెక్షన్లు, ఎత్నిక్‌వేర్, మహిళలు, పురుషులు, పిల్లల కోసం అందుబాటులో ఉన్న వస్త్రాలను పరిశీలించి సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధునాతన డిజైన్లతో వస్త్రాలను అందించడంలో అతి పెద్ద షాపింగ్‌మాల్‌గా మాంగళ్య నిలిచిందని పేర్కొన్నారు. నార్సింగిలో ఏర్పాటు చేసిన స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ స్టోర్‌లో ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతోపాటు అధునాతన కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ శుభకార్యాల్లో ధరించే అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉండడం మాంగళ్య షాపింగ్ మాల్ ప్రత్యేకత అని వెల్లడించారు. షాపింగ్‌మాల్ డైరెక్టర్లు పీఎన్ మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత 12 ఏళ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటి వరకూ 21స్టోర్లు ప్రారంభించామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఆదివారం మరో స్టోర్‌ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. త్వరలోనే కర్ణాటకలోనూ స్టోర్లను విస్తరిస్తామని వివరించారు. ‘మాంగళ్య’ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.