ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎలక్షన్‌రెడ్డిలను సస్పెండ్ చేయాలి
ABN , Publish Date - Mar 23 , 2024 | 11:15 PM
గజ్వేల్, మార్చి 23: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి బీఆర్‌ఎస్ అధిష్టానాన్ని కోరారు.

పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు
నర్సారెడ్డి 100 రోజుల్లో వసూలు చేసిన చిట్టా విప్పుతా
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి
గజ్వేల్, మార్చి 23: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి బీఆర్‌ఎస్ అధిష్టానాన్ని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నర్సాపూర్ అభ్యర్థికి మద్దతుగా ఎలక్షన్‌రెడ్డి పనిచేశారన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి పార్టీ ఎంపీ అభ్యర్థికి మూడోస్థానమా.. లేక రెండోస్థానమా అంటూ అవహేళన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎలక్షన్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా 1100 ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చాడని, ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.5 వేల లంచం తీసుకున్నారని, ట్రాక్టర్‌కు రూ.10 వేల లంచం తీసుకున్నాడని ఆరోపించారు. 2009లో టీడీపీలో ఉండి పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. తాను ఎక్కడ పనిచేసినా నిఖార్సుగా పనిచేశానని, బిజినెస్ అభివృద్ధి, స్వార్థం కోసం పనిచేయలేదని, తనకు బిజినె్‌సలు లేవన్నారు. మూడుసార్లు పోటీచేసి ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నానని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎలక్షన్‌రెడ్డి, యాదవరెడ్డిలను వెంటను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. తాను బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామారెడ్డి గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు.
నాలుగున్నరేళ్లుగా ఎటుపోయావ్ నర్సారెడ్డి
2019లో కాంగ్రె్‌సలో చేరిన నర్సారెడ్డి నాలుగున్నరేళ్లు ఎటుపోయావో చెప్పాలని, పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని, ప్రజాసమస్యలపై పోరాడలేదని ప్రతా్‌పరెడ్డి అన్నారు. తాను కబ్జాలు చేశానని నిరూపించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలోని నల్లాలబాయి, సింగాయపల్లిలో కాఫీ ఫ్యాక్టరీ భూములు, బట్టల మిల్లు కబ్జా చేశారని, రాజీవ్ రహదారిపై గల చెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. 2014లో కాంగ్రె్‌సను నమ్ముకుని ఎన్నికలకు నాలుగు రోజుల ముందు నుంచి ఎవరికి అందుబాటులో లేకుండాపోయారని, అనంతరం పార్టీలో చేరి పదవులు అనుభవించి కేసీఆర్‌కు మోసం చేశారన్నారు. 2018లో ఎంతకు అమ్ముడుపోయావో చెప్పాలని, 2023లో డిపాజిట్ కూడా రాలేదన్నారు. 2014 నుంచి 2018 వరకు పార్టీలో ఉండి పార్టీని కాపాడిన వాళ్లకి ప్రస్తుతం నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నామినేటెడ్ పదవులను అమ్మకానికి పెట్టాడని ఆరోపించారు. పదేళ్లుగా నర్సారెడ్డితో ఉన్న నాయిని యాదగిరికి, వర్గల్ నరేందర్‌రెడ్డికి, ములుగు మాజీ ఎంపీపీ వెంకట్రాంరెడ్డికి పదవులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రతా్‌పరెడ్డి పేరు వింటేనే నర్సారెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని, వందరోజులలో నర్సారెడ్డి నియోజకవర్గంలో వసూలు చేసి చిట్టాను పార్లమెంట్ ఎన్నికలకు ముందే బహిర్గతం చేస్తానని ప్రకటించారు. తాను కాంగ్రె్‌సలోకి వెళ్తే ఆయన ఇంటి వద్ద పది మంది కూడా ఉండరన్నారు. తాను అనుకుంటే నర్సారెడ్డి రోడ్డుపై కూడా తిరగలేడని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు నవాజ్‌మీరా, రామకృష్ణారెడ్డి, చింత శ్రీనివాస్, శేఖర్, ఉమేశ్, రమేశ్, దుర్గాప్రసాద్, కన్నాయాదవ్, నరేశ్, వెంకటేశ్, మౌసీన్ తదితరులున్నారు.