Indian Currency: దేశంలో నాణేల చరిత్ర తెలుసా మొదటి కరెన్సీ ఎప్పుడు పుట్టిందంటే..
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:59 PM
Indian Currency: భారతదేశంలో 1990కు ముందు చలామణిలో ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు.. దేశ ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక భాగమని ఆర్థికవేత్తలు పేర్కొంటారు. 1950లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొదటి రూపాయి నాణేలను జారీ చేసింది. వీటిని అన్నా సిరీస్‌గా పిలిచేవారు. ఇందులో అర్థ రూపాయి, పావలా, 2 అణాలు, ఒక అణా, అర అణా, ఒక పైసా నాణేలు ఉన్నాయి. ఒక రూపాయికి.. 16 అణాలు లేదా 64 పైసలుగా విభజించారు.

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మొదటి సారి బాధ్యతలు చేపట్టిన అనంతరం.. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత దేశంలో తొలిసారి నోట్ల రద్దు చేశారు. అంతవరకు నోట్ల రద్దుపై దేశ ప్రజలకు అంతగా అవగాహన అయితే లేదన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక భారతదేశంలో 1990కు ముందు చలామణిలో ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు.. దేశ ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక భాగమని ఆర్థికవేత్తలు పేర్కొంటారు. 1950లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొదటి రూపాయి నాణేలను జారీ చేసింది. వీటిని అన్నా సిరీస్‌గా పిలిచేవారు. ఇందులో అర్థ రూపాయి, పావలా, 2 అణాలు, ఒక అణా, అర అణా, ఒక పైసా నాణేలు ఉన్నాయి. ఒక రూపాయికి.. 16 అణాలు లేదా 64 పైసలుగా విభజించారు.
నాటి నుంచి రూపాయికి 100 పైసలు చలామణి..
ఇక 1957లో భారతదేశంలో డెసిమల్ విధానాన్ని అవలంబించిందీ ప్రభుత్వం. దీనితో ఒక రూపాయికి 100 పైసలుగా చలామణిలోకి వచ్చింది. అలా అదే ఏడాదిలో 1, 2, 5, 10, 25, 50 పైసల నాణేలు చలామణిలోకి వచ్చాయి. అల్యూమినియం.. కాంస్యం.. నికెల్ లోహాలతో వీటిని తయారు చేశారు. 1964లో జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మొదటి స్మారక నాణాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. 1968లో 20 పైసలు, 1969లో ఒక రూపాయి నాణాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. అలాగే 1970లలో 1, 2, 3 పైసల నాణేలు క్రమంగా తొలగించారు. ఎందుకంటే వీటి విలువ చాలా తక్కువ అయింది. 1982లో రూ. 2 నాణెం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడింది.
కరెన్సీ నోట్లు జారీ ఎప్పటి నుంచంటే..
అలాగే కరెన్సీ నోట్ల విషయానికొస్తే..1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కరెన్సీ జారీ చేయడం ప్రారంభించింది. స్వాతంత్రర్యానికి ముందుకు 1,5,10,100,1000,10000 రూపాయల నోట్లు ఉండేవి.. అదీ కూడా వాటిపై జార్జి VIచిత్రాన్ని ముద్రించేవారు. 1946లో రూ. వెయ్యి. రూ. 10 వేల నోట్లు రద్దయ్యాయి.1950 తర్వాత అశోక స్తంభం గుర్తుతో కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయి. అవి..1,2,5,10,100 రూపాయల నోట్లు ఉండేవి. ఇక 1953లో 1000 రూపాయి నోటు తిరిగి వచ్చింది. 1978లో అధిక విలువ కలిగిన రూ. వెయ్యి, రూ. 5 వేలు, రూ. 10 వేలు నోట్లు మళ్లీ రద్దయ్యాయి.నల్లధనం అరికట్టేందుకు.. 1987లో రూ. 500 నోటు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకు వచ్చింది. వీటిపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించింది.
దేశ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించిన కరెన్సీ..
1990 నాటికి చలామణిలో 1, 2, 5, 10, 20, 50, 100, 500 రూపాయల నోట్లతోపాటు 5, 10, 20, 25, 50 పైసలు, 1, 2 రూపాయల నాణేలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ కరెన్సీ డిజైన్లు భారత సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించాయి. 1990లో ఆర్థిక సంస్కరణలతో కరెన్సీ వ్యవస్థలో మార్పులు మొదలయ్యాయి.కానీ అప్పటి వరకు ఈ నాణేలు,నోట్లు రోజువారీ లావాదేవీల్లో అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ చరిత్ర భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను సూచించిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Bear Funny Video: దీనికి ఇదెవరు నేర్పించారబ్బా.. ఈ ఎలుగుబంటి ఎలా తింటుందో చూస్తే..
Funny Viral Video: అది మట్టి కాదమ్మా.. బట్టలు.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..