మల్లన్న భక్తులకు ఏ ఇబ్బందులు కలగొద్దు..
ABN , Publish Date - Dec 13 , 2024 | 04:15 AM
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
కొమురవెల్లి జాతరపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఈనెల 29న ఉదయం 10.45 నిమిషాలకు మల్లికార్జున స్వామి కల్యాణం, జనవరి 19 నుంచి 10 ఆదివారాల పాటు అంటే మార్చి 23 వరకు జాతర నిర్వహించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.