MP Lakshman: బీఆర్ఎస్ చచ్చిన పాము.. బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదు..
ABN , Publish Date - Feb 19 , 2024 | 11:37 AM
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో తమ పార్టీకి పొత్తుండదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఒక చచ్చిన పాము అని.. బీఆర్ఎస్ ఇక మీదట బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. తమ పార్టీకి10 సీట్లు, 35శాతం ఓట్లు వస్తాయన్నారు. ఏపీలో పవన్ కల్యాణ్ తో పొత్తు ఉందన్నారు. టీడీపీతో పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో తమ పార్టీకి పొత్తుండదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఒక చచ్చిన పాము అని.. బీఆర్ఎస్ ఇక మీదట బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. తమ పార్టీకి10 సీట్లు, 35శాతం ఓట్లు వస్తాయన్నారు. ఏపీలో పవన్ కల్యాణ్ తో పొత్తు ఉందన్నారు. టీడీపీతో పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
లోక్‌సభ ఎన్నికలు మహాభారత యుద్ధం లాంటివని లక్ష్మణ్ తెలిపారు. ఇండియా కూటమి ఒక కౌరవ సైన్యమని.. రాహుల్ గాంధీ భారత్ జోడో బదులుగా.. కాంగ్రెస్ జొడో చేపడితే బాగుంటుందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి పట్ల ప్రజలు విసిగి పోయారన్నారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. ఆరు గ్యారంటీల కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు.