New Year: యువతకు కిక్కిచ్చేలా.. నూతన సంవత్సర వేడుకలకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:59 AM
నగరమంతా దృష్టిసారించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్(Banjara Hills, Jubilee Hills) ప్రాంతంలో నూతన ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు కుర్రకారు సిద్ద్ధమవుతోంది. పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్లు, రిసార్ట్‌లలో సంబురాలను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

- ప్రత్యేక ఆఫర్‌లు ప్రకటిస్తున్న నిర్వాహకులు
- పార్టీలపై పోలీసుల ప్రత్యేక నిఘా
హైదరాబాద్: నగరమంతా దృష్టిసారించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్(Banjara Hills, Jubilee Hills) ప్రాంతంలో నూతన ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు కుర్రకారు సిద్ద్ధమవుతోంది. పబ్‌లు, క్లబ్‌లు, హోటళ్లు, రిసార్ట్‌లలో సంబురాలను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి కుర్రకారుకు కిక్కిచ్చేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber crime: మనీ ల్యాండరింగ్ పేరుతో.. వృద్ధుడికి రూ.9.5 లక్షల టోకరా
హోరెత్తించనున్న డీజే సౌండ్స్..
ఈసారి వేడుకల్లో డీజేల హోరు కనిపించనుంది. వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం డీజే నిర్వాహకులు వస్తున్నారు. తాజ్ గ్రూప్ హోటల్స్, రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్స్‌లో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని 32 పబ్‌లు, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌ల ఆధ్వర్యంలో బెంగళూరు, కోల్‌కత్తా నుంచి డీజేలనురప్పిస్తున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కొవ్వొత్తుల వెలుగుల్లో డిన్నర్‌తో పాటు లేజర్ షోలు నయాసాల్ వేడుకల్లో కనువిందు చేయనున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ నిర్వాహకులు అస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా డీజేలను తీసుకొస్తున్నారు. మరోపబ్ నిర్వాహకులు బాలీవుడ్ గాయకులతో లైవ్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు.
ఈవెంట్ నిర్వాహకులదే బాధ్యత..
నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పార్టీకి వచ్చే వారికి ఏం జరిగినా పూర్తి బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. నయాసాల్ వేడుకల్లో డ్రగ్స్ దందా జోరందుకుంటుందన్న సమాచారం నేపథ్యంలో పబ్‌లు, హుక్కా సెంటర్‌లు, రెస్టారెంట్‌లపై ప్రత్యేక నిఘా పెట్టారు. పబ్, ఈవెంట్ మేనేజర్‌లకు నోటీసులిచ్చారు.
మత్తు పదార్థాలను సరఫరా చేసినా, ఎవరితోనైనా అమ్మించినా వదిలేది లేదని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రతి ఏటా మద్యం మత్తులో యువత రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా హిల్స్ ప్రాంతంలో ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అధికంగా చేపట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల వేగాన్ని నిరోధించేందుకు బారికేడ్లు, వేగ నిరోధకాలు పెడుతున్నారు.
ఎంజాయ్ చేయండి.. మేమే తీసుకెళ్తాం..
నయాసాల్ వేడుకల్లో మందు లేకపోతే మజా ఉండదనేది చాలామంది అభిప్రాయం. అయితే తాగుదామంటే డ్రంకెన్‌డ్రైవ్‌లో దొరికిపోతామనే భయం యువతలో ఉంది. అలాంటి వారికోసం కొన్ని పబ్‌లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకులు బంపర్ ఆఫర్‌ను ప్రకటించాయి. పార్టీలో ఎంజాయ్ చేసి మస్తుగా తాగిన తరువాత జాగ్రత్తగా ఇంటివద్ద దింపడం తాము చూసుకుంటామని చెబుతున్నారు. పార్టీ అయిపోయిన వెంటనే షేరింగ్ ప్రకారం క్యాబ్‌లలో జాగ్రత్తగా ఇంటికి పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఈవెంట్ నిర్వాహకులు క్యాబ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రయాణం ఖర్చుతో కలిపి టికెట్లను అమ్ముతున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని నిర్వాహకులు అంటున్నారు.
మత్తులో అల్లరి చేస్తే జైలుకే..
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు చిక్కితే జైలుకు వెళ్లాల్సిందే. రోడ్డు మీద మద్యం తాగినా, మత్తులో గొడవ చేసినా పెట్టీ కేసులు నమోదు చేసి నేరుగా కోర్టుకు పంపిస్తారు. న్యాయమూర్తి ఇలాంటి వారికి రెండు నుంచి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రాత్రి తాగి రోడ్ల మీదకు వస్తే సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా పబ్‌లు, బార్‌ల నిర్వాహకులకు పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు చేశారు. పార్టీల పేరుతో రాత్రంతా తెరిచి ఉంచితే ఊరుకునేది లేదని.. గొడవలు జరగకుండా అదనపు భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
Read Latest Telangana News and National News