Share News

Bhatti : ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:23 AM

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకుని వచ్చే ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Bhatti : ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం

  • భావి అవసరాలకు తగ్గట్టు విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు

  • ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకుని వచ్చే ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌ కల్యాణ్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌స్సీ) కొత్త కార్యాలయం ‘విద్యుత్‌ నియంత్రణ్‌ భవన్‌’ను ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నెట్‌జీరో బిల్డింగ్‌ను నిర్మించినందుకు ఈఆర్‌సీ చైర్మన్‌, సభ్యులను అభినందించారు.


రైతుల పంటపొలాల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని భట్టి ప్రకటించారు. రైతులు తమ పంప్‌సెట్లకు అవసరమైన విద్యుత్‌ను వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామాల్లో దీన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ట్ర జీఎస్డీపీ వృద్ధికి దోహదపడే రంగాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు వచ్చే పదేళ్లలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

Updated Date - Oct 17 , 2024 | 03:23 AM