CM Revanth: సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి, నెలరోజుల పాలనపై సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 07 , 2024 | 11:22 AM
తెలంగాణ ముఖ్యమంత్రిగా నెలరోజులు పూర్తి చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ 30 రోజుల పాలన తనకు సంతృప్తిని కలిగించిందని సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా నెలరోజులు పూర్తి చేసుకున్నారు రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఈ 30 రోజుల పాలన తనకు సంతృప్తిని కలిగించిందని సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ అని రాసుకొచ్చారు. తన పాలనపై సీఎం రేవంత్ హ్యాపీగా ఉన్నారు.
తాము ప్రజా సేవకులమే తప్ప పాలకులం కాదు అని సీఎం రేవంత్ (Revanth) స్పష్టంచేశారు. నెలరోజుల పాలన తనకు కొత్త అనుభూతిని కలిగించిందని అభిప్రాయ పడ్డారు. పేదలు, యువత, ఆడబిడ్డల మొహాల్లో ఆనందం చూశానని, రైతులకు భరోసా ఇచ్చామని ప్రస్తావించారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి పాటుపడతామని వివరించారు.
రాష్ట్రంలో మత్తు లేకుండా చేసేందుకు ప్రయత్నించామని సీఎం రేవంత్ (Revanth Reddy) పేర్కొన్నారు. బెల్ట్ షాపుల మూసివేత నిర్ణయం గురించి పరోక్షంగా ట్వీట్‌లో ప్రస్తావించారు. తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు మరింత బాధ్యతగా ఉంటానని స్పష్టంచేశారు. మొత్తానికి నెలరోజుల పాలనపై సీఎం రేవంత్ సంతృప్తిని వ్యక్తం చేశారు.