జగన్‌ తీరును తప్పుపడుతున్న నాయకులు

ABN, Publish Date - Oct 21 , 2024 | 08:11 AM

విజయసాయి రెడ్డి అండ్ కో విశాఖను అడ్డంగా దోచుకుని అన్ని విధాలుగా నాశనం చేశారని పొలిటికల్ ప్రత్యర్థులు విరుచుకుపడేవారు. ఈ నేత అండతోనే భూ కుంభకోనాలు, కబ్జాలు, సీఆర్‌జడ్ నిబంధనల ఉల్లంఘనలు యధేచ్చగా జరిగాయి. అంతేకాదు..

అమరావతి: ఉత్తరాంధ్ర వైసీపీలో మళ్లీ విజయసాయిరెడ్డి లొల్లి మొదలైంది. పార్టీని భ్రష్టు పట్టించిన నేతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర రగడ జరుగుతోంది. అధిష్టానం తీరుకు నిరసనగా కీలక నేతలు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఫ్యాన్ పార్టీ పవర్‌లో ఉండగా విజయసాయి రెడ్డి చక్రం తిప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలో రీజినల్ కోఆర్డినేటర్‌గా పనిచేసినప్పుడు భూ దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అనుచరులు ఆయనను ఉత్తరంధ్ర సీఎంగా పిలుచుకునేవారు. ఘనంగా భర్తడే వేడుకలు నిర్వహించి లబ్ది పొందినవారూ ఉన్నారు.


విజయసాయి రెడ్డి అండ్ కో విశాఖను అడ్డంగా దోచుకుని అన్ని విధాలుగా నాశనం చేశారని పొలిటికల్ ప్రత్యర్థులు విరుచుకుపడేవారు. ఈ నేత అండతోనే భూ కుంభకోనాలు, కబ్జాలు, సీఆర్‌జడ్ నిబంధనల ఉల్లంఘనలు యధేచ్చగా జరిగాయి. అంతేకాదు.. టీడీపీలో బలమైన నేతలను వైసీపీలో రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారి బలహీనతలను బయటపెట్టి బెదిరించేవారట.. నోటికి పని చెప్పి దూషించేవారు. వైసీపీ నేతల అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెట్టడం.. లేదా అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రతి శనివారం బుల్డోజర్లకు పని చెప్పడమో జరిగేది.


ఈ వార్తలు కూడా చదవండి..

పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

షర్మిలతో రాయ‘బేరం’

దీపావళి నుంచే ఉచిత గ్యాస్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 21 , 2024 | 08:13 AM