Share News

మూడునెలలు గుడి మూసేయాలన్నారు

ABN , Publish Date - Mar 22 , 2025 | 02:03 AM

గతంలో తిరుమలలో నీళ్ల సమస్య తీవ్రంగా వచ్చింది. మూడు నెలల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం తప్ప మరో దారి లేదని అధికారులు నాతో చెప్పారు. నాకు చాలా కోపం వచ్చింది. ‘ఆలయాన్ని మూసివేయడం ఏంటయ్యా, మీకేమైనా పిచ్చిపట్టిందా?’ అని కోప్పడ్డాను.

మూడునెలలు   గుడి మూసేయాలన్నారు

తిరుమలలో నీటి ఎద్దడి రోజులను గుర్తుచేసిన సీఎం

‘గతంలో తిరుమలలో నీళ్ల సమస్య తీవ్రంగా వచ్చింది. మూడు నెలల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం తప్ప మరో దారి లేదని అధికారులు నాతో చెప్పారు. నాకు చాలా కోపం వచ్చింది. ‘ఆలయాన్ని మూసివేయడం ఏంటయ్యా, మీకేమైనా పిచ్చిపట్టిందా?’ అని కోప్పడ్డాను. రోజుకు 600 నుంచి 800 ట్యాంకర్లను భక్తుల రాకపోకల మధ్య తిరుమలకు తీసుకొచ్చే పనులు చేయలేం అని అధికారులు నాతో అన్నారు. నేను అంగీకరించలేదు. కల్యాణిడ్యాం నుంచి తిరుమలకు నీళ్లు తీసుకువచ్చేలా పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలనీ, అదీ 90 నుంచి 95 రోజుల్లో జరగాలని ఆదేశించా. లేకుంటే అరెస్ట్‌ చేస్తానని కూడా చెప్పా. దేవుడి కోసం కాబట్టి అందరినీ పిలిచి.. ‘ఉన్న డబ్బులు ఇవే. పూర్తి చేయండి అని కోరా. ఎల్‌అండ్‌టీ ముందుకొచ్చింది. అనుకున్న సమయానికి కళ్యాణి డ్యాం నుంచి తిరుమలకు పైప్‌ లైన్‌లు వేసింది. అంతే కళ్యాణి నీళ్లు తిరుమల కొండ మీదకి ఎక్కాయి.’ అని ఒకనాటి రోజులను సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.తిరుపతి, తిరుమలలో నీటి సమస్యను పరిష్కరించేందుకు కండలేరు నీటి ప్రాజెక్ట్‌ సామర్థ్యాన్ని పెంచుతారా అని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బదులిస్తూ.. ‘తిరుమలకు నీళ్లు తీసుకురావడం పెద్ద సమస్యేమీ కాదు. సోమశిల, కండలేరు, బాలాజీ రిజర్వాయర్‌ ఉంది. కల్యాణి డ్యాం నుంచి కూడా తిరుమలకు నీళ్లు తీసుకుంటున్నాం. మల్లిమడుగు కూడా వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు’ అన్నారు. అసలు చరిత్ర ఏంటో మీరు తెలుసుకోవాలి. యువతరానికి కూడా మనం తెలియజేయాలి. తిరుపతిలో నీళ్లు లేక నిత్యం సమస్యలు ఏర్పడుతున్న క్రమంలో తెలుగు గంగను నేనే తీసుకొచ్చా అని వివరించారు.

Updated Date - Mar 22 , 2025 | 02:03 AM