Share News

Bangalore Rave Party: హేమ ఏంటి ఈ డ్రామా..!

ABN , Publish Date - May 27 , 2024 | 01:56 PM

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటి హేమ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో తమ విచారణకు హాజరుకావాలని ఆమెకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Bangalore Rave Party: హేమ ఏంటి ఈ డ్రామా..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటి హేమ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో తమ విచారణకు హాజరుకావాలని ఆమెకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని.. ఈ నేపథ్యంలో తనకు కొంత గడువు కావాలని ఆమె బెంగళూరు పోలీసులను కోరారు. కానీ వెంటనే విచారణకు హాజరుకావాలని హేమకు మరో నోటీసు జారీ చేసేందుకు బెంగళూరు పోలీసులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది.


మరోవైపు ప్రముఖ నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో ఆ వార్తలను ఖండిస్తూ.. ఆమె వెంటనే ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదని.. తాను హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ.. ఆ వీడియోలో హేమ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. అనంతరం బెంగళూరు పోలీసులు హేమ ఫొటోను సైతం విడుదల చేశారు. దీంతో రేవ్ పార్టీలో పాల్గొన లేదంటు ఆమె చేసిన వ్యాఖ్యలు అబద్దమని తెలింది. ఇక ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ.. కృష్ణవేణి పేరుతో హాజరైనట్లు తెలుస్తుంది. హేమ అసలు పేరు కృష్ణవేణి.

Read Latest National News and Telugu News

Updated Date - May 27 , 2024 | 02:01 PM