Share News

Buying Water Melon: పుచ్చకాయ కొంటున్నారా..తియ్యగా, జ్యూసీగా ఉన్నవి కనిపెట్టేందుకు సింపుల్ టిప్స్..

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:31 AM

Buying Water Melon Tips: పుచ్చకాయ కొనేటప్పుడు ఇది తియ్యగా ఉంటుందో.. ఉండదో.. అనే సందేహాలు రావడం సహజం. అలాగే, కొన్న తర్వాత రుచి బాగుండదేమో.. కాయ మొత్తం తీనడానికి పనికిరాకుండా పోతే అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. అయితే, ఇకపై ఈ చింత అక్కర్లేదు. ఈ సాధారణ చిట్కాలతో మంచి రుచికరమైన పుచ్చకాయను ఇట్టే కనిపెట్టేయవచ్చు..

Buying Water Melon: పుచ్చకాయ కొంటున్నారా..తియ్యగా, జ్యూసీగా ఉన్నవి కనిపెట్టేందుకు సింపుల్ టిప్స్..
How to Buy Perfect Water Melon

Buying Water Melon Tips: సమ్మర్‌లో ఎంత నీరు తాగినా సరిపోదు. ఉక్కపోతకు చెమట కారిపోతూనే ఉంటుంది. బాడీ త్వరగా డీహైడ్రేట్ అయిపోవడం వల్ల పదే పదే నీరు తాగాల్సి వస్తుంది. ఎంత తాగినా దాహం తీరకపోవడంతో డైలీ కాసిన్ని పుచ్చకాయ ముక్కలు తింటుంటారు అంతా. అందుకోసం వారంలో రెండు మూడు సార్లయినా మార్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ కొనుగోలు చేస్తుంటారు. తీరా ఇంటికి తెచ్చి పుచ్చకాయ కోసి చూస్తే తెల్లగా పాలిపోయినట్లుగానో లేకపోతే సగం పండి లేదా ఎండినట్లుగా కనిపిస్తే కచ్చితంగా నిరాశకు గురవుతాం. తినడానికి పనికిరాకుండా పోయిందే అనే బాధ ఎప్పటికీ మీకు కలగకూడదంటే.. పుచ్చకాయ కొనేటప్పుడు ఈ చిన్నపాటి చిట్కాలు అనుసరించండి. ‌


1. గుండ్రని లేదా ఓవల్ ఆకారం

పుచ్చకాయ కొనేటప్పుడు సరైనది ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. పుచ్చకాయ ఆకారం కూడా రుచిని నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీకు ఎలాంటి కొనుక్కోవాలో అర్థంకాకపోతే గుండ్రని ఆకారంలో ఉన్న పుచ్చకాయను కొనుగోలు చేయండి. ఎందుకంటే ఇది తియ్యగా ఉంటుంది.పెద్దగా, బరువుగా ఉంది కదాని ఓవల్ లేదా గుడ్డు ఆకారంలో ఉన్నది తీసుకుంటే తప్పకుండా అందులో తీపి తక్కువగా ఉంటుంది.


2. పసుపు మచ్చలు

ప్రతి పుచ్చకాయ మీద చాలామంది గుర్తులు చూస్తారు. కానీ పైన పసుపు రంగు మచ్చలు ఉన్న పుచ్చకాయ చాలా తియ్యగా ఉంటుంది. పుచ్చకాయ పండినది అని చెప్పేందుకు ఇదో సూచన. ఎందుకంటే పుచ్చకాయ నేలపై ఉన్న ప్రదేశప్పుడు పసుపు లేదా లేత క్రీమీ రంగు మచ్చ ఏర్పడుతుంది. దీనిని ఫీల్డ్ స్పాట్ అంటారు. ఈ గుర్తు పుచ్చకాయ బాగా పండిందా లేదా అని చెబుతుంది.


3. మెష్ గుర్తులు

పుచ్చకాయ పై భాగంలో నెట్ లాంటి గుర్తులను జాగ్రత్తగా చూడండి. నల్లని గీతలు కనిపిస్తాయి. వీటిని వెబ్బింగ్ అంటారు. ఈ గీతలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే పుచ్చకాయ తీపిగా ఉందని అర్థం. తేనెటీగల ద్వారా పరాగసంపర్కం సమయంలో ఈ గుర్తులు ఏర్పడతాయంట.


4. బరువు

మీరు ప్రతిసారీ కోయకుండా తియ్యగా పండిన పుచ్చకాయను ఎంచుకోవాలనుకుంటే దాని బరువుపై కచ్చితంగా దృష్టి సారించండి. పుచ్చకాయలో దాదాపు 90% నీరు ఉంటుందని మనందరికీ తెలుసు. కాబట్టి అది పూర్తిగా పండి రసంతో నిండి ఉంటే దాని బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకే పరిమాణంలో ఉన్న రెండు పుచ్చకాయలలో బరువైనది జ్యూసీగా, తియ్యగా ఉంటుంది. కాబట్టి మీరు పుచ్చకాయ కొన్నప్పుడల్లా దానిని రెండు చేతుల్లో పట్టుకుని బరువుగా అనిపించేదాన్నే తీసుకోండి.


5. సౌండ్

మీరు పుచ్చకాయను తేలికగా తట్టినప్పుడు లేదా మీ వేళ్ళతో తట్టినప్పుడు వచ్చే శబ్దం పుచ్చకాయ లోపలి భాగం ఎలా ఉందో తెలియజేస్తుంది. పుచ్చకాయ నుంచి లోతైన ప్రతిధ్వని వస్తే జ్యూసీగా, తియ్యగా ఉంటుందనేందుకు సంకేతం. అలా కాకుండా పుచ్చకాయను చేత్తో తట్టినప్పుడు గట్టిగా శబ్దం వస్తే పచ్చిగా ఉండవచ్చు.


Read Also : Summer Tips: ఎండవేడికి అరచేతుల్లో చెమట పడుతున్నాయా.. ఈ చిట్కాలతో క్షణాల్లో రిలీఫ్..

Milk Boiling: పాలు, టీ హీట్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోవాలి..

Egg Viral Video: గుడ్డు పెంకు ఈజీగా ఎలా తీశాడంటే.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా..

Updated Date - Mar 27 , 2025 | 12:24 PM