Share News

Year Ender 2024: టెస్టుల్లో టాప్ బౌలింగ్ స్పెల్స్.. ఒక్కొకటి నిప్పు కణమే..

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:32 PM

ఈ ఏడాది టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన బౌలింగ్ స్పెల్స్ నమోదయ్యాయి. తోపు బౌలర్లతో పాటు యంగ్ బౌలర్లు కూడా సత్తా చాటారు. వారిలో నుంచి టాప్-5 బౌలింగ్ స్పెల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

Year Ender 2024: టెస్టుల్లో టాప్ బౌలింగ్ స్పెల్స్.. ఒక్కొకటి నిప్పు కణమే..
Best Bowlers In 2024

ఈ సంవత్సరం టెస్ట్ ‌క్రికెట్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఒకప్పుడు క్రికెట్ అంటే లాంగ్ ఫార్మాటే. కానీ వన్డేలు, టీ20ల హవాలో ఈ సంప్రదాయ ఫార్మాట్ ప్రాభవం కోల్పోయింది. అయితే మొత్తానికి తిరిగి పుంజుకుంటున్న టెస్టులకు రోజురోజుకీ పాపులారిటీ పెరుగుతోంది. దీనికి యంగ్ జనరేషన్ ప్లేయర్లు అద్భుతంగా ఆడుతూ ఆడియెన్స్ మనసుల్ని దోచుకోవడమే. ఈ ఏడాది కూడా ఇంటర్నేషనల్ లెవల్‌లో చాలా మంది ఆటగాళ్లు టెస్టుల్లో దుమ్మురేపారు. బౌలింగ్‌లో పలువురు మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో టాప్-5 బౌలింగ్ స్పెల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..


నోమన్ అలీ

పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లతో సత్తా చాటాడు. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అతడు 16.3 ఓవర్లు వేసి 46 పరుగులకు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. స్టార్లతో నిండిన ఇంగ్లీష్ లైనప్‌ను తన స్పిన్ అస్త్రాలతో అతడు కకావికలం చేశాడు. ఈ స్పెల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు.


మార్కో యాన్సన్

సౌతాఫ్రికా పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సన్ ఈ ఏడాది టెస్టుల్లో ఒక బెస్ట్ స్పెల్ వేశాడు. డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో 6.5 ఓవర్లలో కేవలం 13 పరుగులు ఇచ్చుకొని ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. లంక బ్యాటర్లతో అతడు ఓ ఆటాడుకున్నాడు. లీథల్ పేస్‌తో ప్రత్యర్థులను చావుదెబ్బ కొట్టాడు.


అట్కిన్సన్

ఇంగ్లండ్ యంగ్ సీమర్ అట్కిన్సన్ కూడా లాంగ్ ఫార్మాట్‌లో మ్యాజికల్ స్పెల్‌తో అదరగొట్టాడు. వెస్టిండీస్ మీద 12 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చుకొని 7 వికెట్లు తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు పోయించాడు.


మిచెల్ శాంట్నర్

న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కూడా బెస్ట్ బౌలర్ల జాబితాలో ఉన్నాడు. అతడు టీమిండియాతో మ్యాచ్‌లో 19.3 ఓవర్లలో 53 పరుగులకు 7 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీశాడు. భారత్ పతనాన్ని శాసించి కివీస్‌ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.


వాషింగ్టన్ సుందర్

టీమిండియా యంగ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా టెస్టుల్లో బెస్ట్ స్పెల్స్ వేరిన లిస్టులో ఉన్నాడు. అతడు న్యూజిలాండ్‌తో టెస్ట్‌లో 23.1 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చుకొని 7 వికెట్లు పడగొట్టాడు. కివీస్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. సుడులు తిరిగే ఆఫ్ స్పిన్‌ డెలివరీస్‌తో అపోజిషన్ బ్యాటర్లను వణికించాడు.


For Year Ender Articles Click Here

Also Read:

అశ్విన్‌పై కుట్ర.. పక్కా ప్లానింగ్‌తో సైడ్ చేసేశారు

రిటైర్మెంట్ ఇచ్చినా బేఫికర్.. పెన్షన్‌తో పాటు అశ్విన్‌కు ఫుల్ బెనిఫిట్స్

బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్

రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. మియా పగబడితే ఇలాగే ఉంటది

For More Sports And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 01:42 PM