Rewind 2024: రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్ల విలక్షణ తీర్పు
ABN , Publish Date - Dec 19 , 2024 | 04:05 PM
2024 ఏడాది .. దేశంలోని 8 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమదైన శైలిలో తీర్పు ఇచ్చారు.
దేశంలో ఈ ఏడాది అంటే 2024లో.. మొత్తం ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ఓటర్లు తమదైన శైలిలో తీర్పు ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలు మళ్లీ అధికార పీఠాన్నీ దక్కించుకొంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం అప్పటి వరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీలు అధికార పీఠాన్ని కైవసం చేసుకొన్నాయి. ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం..
ఈ ఏడాది ఏప్రిల్‍లో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ (60), సిక్కిం (32) అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‍లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో పెమా ఖండు మళ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సిక్కింలో క్రాంతి కారి మోర్చా పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. దీంతో ప్రేమ్ సింగ్ తమాంగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ.. కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్, ఒడిశా..
ఆంధ్రప్రదేశ్‍కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు.. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను.. 164 స్థానాలను కూటమి దక్కించుకోవడం విశేషం. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్.. అధికారాన్ని కోల్పోవడమే కాదు.. ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకో లేక పోయారు. ఆ పార్టీకి కేవలం 11 స్థానాలను మాత్రమే దక్కించుకోవడం గమనార్హం.
Also Read: ఎన్‍కౌంటర్‍లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ సారి ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 147 స్థానాలున్న అసెంబ్లీకి రెండు విడతలుగా.. అంటే మే 13వ తేదీతోపాటు జూన్ 1వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 78 స్థానాలను గెలుచుకొని.. ఆ రాష్ట్రంలో అధికార పీఠాన్ని తొలిసారిగా దక్కించుకొంది. దీంతో 25 ఏళ్ల బిజు జనతాదళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ పాలనకు చరమ గీతం పాడినట్లు అయింది. దీంతో ఒడిశా సీఎంగా బీజేపీ నేత మోహన చరణ్ మాంఝీ బాధ్యతలు చేపట్టారు.
Also Read: అమిత్ షాపై హీరో విజయ్ ఫైర్
జమ్మూ కశ్మీర్, హర్యానా...
ఆ తర్వాత.. సెప్టెంబర్‍లో జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడు విడుతల్లో ఎన్నికలు జరగగా.. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ రాష్ట్ర ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. అంటే కొన్ని సంవత్సరాల పాటు జమ్మూ కశ్మీర్‍లో రాష్ట్రపతి పాలన సాగింది. అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసింది. అలాంటి వేళ జరిగిన ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో ఈ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ ఓటర్లు తమదైన విజ్జతను ప్రదర్శించినట్లు ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు.. దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ
ఇక హర్యానాలో మాత్రం బీజేపీ మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ రాష్ట్రంలో తమ సత్తా చాటుతామని భావించిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశే ఎదురైంది.
Also Read: సీఎంలు చంద్రబాబు, నితీశ్‍లకు సూటి ప్రశ్న
మహారాష్ట్ర, జార్ఖండ్..
ఇక నవంబర్‍లో.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ నిర్వహించారు. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్‍కు రెండు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మాత్రం ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు.. మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడం గమనించాల్సిన విషయం. అంటే జార్ఖండ్‍లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జార్కండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలు అత్యధిక స్థానాలను గెలుచుకొన్నాయి. దీంతో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా వరుసగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే జార్ఖండ్‍లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోనేందుకు జేఎంఎం మీద బీజేపీ చేసిన ఆరోపణలు.. ఆ రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా తిప్పి కొట్టినట్లు అయింది.
Mallikarjun Kharge: అమిత్ షా వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
Also Read: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్
అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (బాల్ ఠాక్రే) పార్టీలకు.. మహాయుతి కూటమిలోని బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్). శివసేన (ఏకనాథ్ శిండే) పార్టీల మధ్య ప్రధాన పోరు జరిగింది. ఈ పోరులో మహాయుతి కూటమి వైపే తామంటూ మహారాష్ట్ర ఓటర్లు.. తమ ఓటు హక్కు ద్వారా స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు పక్కా క్లారిటీగా ఉన్నారని మరోసారి స్పష్టమైంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం దాదాపు పది రోజుల పాటు ఉత్కంఠ నెలకొంది. చివరకు బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‍ను మరోసారి అదృష్టం వరించింది. దీంతో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్‍తోపాటు ఏకనాథ్ శిండేలు పదవులు చేపట్టారు. మొత్తంగా ఈ ఏడాది 8 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు మాత్రం పక్కా క్లారిటీగా ఉన్నారన్నది.. ఈ ఫలితాల ద్వారా సుస్పష్టం అవుతోందన్నది నూటికి నూరు శాతం నిజం.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్నీ తెలుగు వార్తలు కోసం..