mla ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకండి
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:17 AM
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి ఫిర్యాదుకూ అధికారులు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.

కదిరి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి ఫిర్యాదుకూ అధికారులు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం తలుపుల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే మాట్లాడారు. దశలవారీగా అన్ని హామీలు పూర్తి చేస్తామన్నారు. వైసీపీ పాలనలో జరిగిన భూదందాలను వెలికి తీస్తున్నామన్నారు. భూదందాలు చేసినవారిని ఎవరిని వదల బోమన్నారు. అధికారంలో ఉన్న మనం బాధ్యతయుతంగా పనిచేయాలని, అధికారులతో పని చేయించుకోవాలని అన్నారు. 125 వినతిపత్రాల ను ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో ఇనచార్జి తహసీల్దార్ రెడ్డిశేఖర్, ఎంపీడీఓ రామానాయక్, టీడీపీ కన్వీనర్ ముబారక్, నాయకులు గరికపలి రామక్రిష్ణారెడ్డి, మేడా శంకర్, వీరభార్గవరెడ్డి, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.