HOUSES :ఇళ్లకు బదులు...ముళ్లకంపల దర్శనం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:57 PM
‘ఇల్లు కాదు..ఊళ్లను నిర్మి స్తున్నాం.’ ఇది గత ప్రభుత్వ హయంలోని ప్రజాప్రతినిధులు చెప్పిన మాట లు. ఆ మాటలు నేడు నీటి మూటలు గా మారాయి. ఇందుకు కొడిమి గ్రామ సమీపంలోని లేఅవుట్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇళ్లు వెలుస్తాయను కున్న చోట. ముళ్ల కంపలు పెరిగాయి. కొని చోట్ల మొండిగోడలు కనిపి స్తున్నాయి.

- గత పాలకుల తీరు... లబ్ధిదారులకు శాపం
- కొడిమి లేఅవుట్‌లో నిలిచిన ఇళ్ల నిర్మాణం
అనంతపురం రూరల్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ‘ఇల్లు కాదు..ఊళ్లను నిర్మి స్తున్నాం.’ ఇది గత ప్రభుత్వ హయంలోని ప్రజాప్రతినిధులు చెప్పిన మాట లు. ఆ మాటలు నేడు నీటి మూటలు గా మారాయి. ఇందుకు కొడిమి గ్రామ సమీపంలోని లేఅవుట్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇళ్లు వెలుస్తాయను కున్న చోట. ముళ్ల కంపలు పెరిగాయి. కొని చోట్ల మొండిగోడలు కనిపి స్తున్నాయి. లేఅవుట్లు ఆ విధంగా దర్శన మివ్వడానికి గత పాలకులే కారణ మన్న వాదనలు వినిస్తున్నాయి. పాలకులు సొంతలాభం కోసం కాంట్రాక్టర్ల అవతారమెత్తి, ఆందినకాటికి సొమ్ముచేసుకుని జోబులు నింపుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారింది. గత వైసీపీ పాలనలో ఇళ్ల నిర్మాణాలలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. గత పాలకుల అక్రమాలతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. వారి పాపమే..లబ్ధిదారులకు ఇళ్లకు బదులు, ముళ్ల కంపలను, చెట్లను, మొండిగోడలను బహుమతిగా ఇచ్చినట్లయింది.
నిర్మాణాలు పూర్తికాకుండానే బిల్లులు..
గత ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇళ్లు- వైఎస్సార్ జగనన్న కాలనీల పేరిట కొడిమిగ్రామ సమీపంలో భూములు సేకరించారు. సర్వే నెంబర్లు 54పి, 255పి, 256పి, 257, 258, 259, 260, 261పి పరిధిలో దాదాపు 80ఎకరాలకు పైగా భూమి సేకరించారు. ఇందులో అనంతపురం నగరంతో పాటు ఎ.నారాయణపురం, కక్కలపల్లి కాలనీ, కొడిమి, పాపంపేట తదితర ప్రాంతాల్లోని 3,500 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. అయితే భూ సేకరణ సమయంలో చెప్పిన విధంగా పరిహారం ఇవ్వకపోవడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్ర యించారు. కోర్టులో ఉన్న భూముల్లో మినహా మిగిలిన వాటిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. కోర్టుకు వెళ్లిన వారికి గత పాలకులు హామీ పత్రాలు ఇచ్చి చేతులుదులుపుకున్నారు. మిగిలిన వారి భూముల్లో ఇళ్లు నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణ బాధ్యతలను అప్పటి ప్రజాప్రతినిధి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన రాక్రీట్ సంస్థ తీసుకుంది. బాధ్యతలు తీసుకోవడంలో ఉన్న స్పీడు.. ఇళ్ల నిర్మాణంలో కనిపించలేదు. స్థానికంగా లేఅవుట్‌ను పరిశీలిస్తే ఎవ్వరికైనా ఆ విషయం అర్థమతుంది. ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన పనికంటే ముందుగానే కాంట్రాక్టు సంస్థ బిల్లులు చేసుకుని పబ్బం గడుపుకుంది. పేదలకు మాత్రం సొంతింటి కలను కలగానే మిగిల్చారు.
పునాదుల్లో ముళ్లకంపలు మొలిచాయి
గత పాలకుల చేసిన తప్పిదాలతో స్థానికంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో లేఅవుట్ అంతా మొండిగోడలు, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. మొండిగోడల చుట్టూ ముళ్లకంపులు ఏపుగా పెరిగిపోయాయి. ఇళ్ల నిర్మాణాలు జరగని ప్లాట్ల లో పిచ్చిమొక్కలు కనిపిస్తున్నాయి. ఇక పునాదుల్లో ముళ్ల కంపలు, చెట్లు పెరిగిపోతున్నాయి. అటుగా వెళ్లినవారికి ఎవరికైనా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రూ. కోట్లు ఖర్చు చేసి..పేదలకు ఇళ్లకు బదులు ముళ్ల కంపలను ఇచ్చారంటూ పెద విరుస్తున్నారు. సాధారణంగా ఇళ్ల నిర్మాణం పూరైతే వాటి ఎదుట పెంచు కోవడానికి మొక్కలను ఇస్తుంటారని, నాటి పాలకులు భిన్నంగా ఇళ్లకు బదులు, పిచ్చిమొక్కలు ఇచ్చినట్లుందని కొందరు మాట్లాడుకుంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....