Handreeniva హంద్రీనీవా లైనింగ్ పనుల అడ్డగింత
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:22 AM
నల్లచెరువు మండలంల కల్లిపల్లి సమీపంలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను ఎపీ రైతు సంఘం నాయకులు, రైతులు బుధవారం అడ్డుకున్నారు.

తనకల్లు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): నల్లచెరువు మండలంల కల్లిపల్లి సమీపంలో జరుగుతున్న హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను ఎపీ రైతు సంఘం నాయకులు, రైతులు బుధవారం అడ్డుకున్నారు. కాలువలు వెడల్పు చేసి నీటిని తీసుకురావాలని రైతులందరూ కలిసి కట్టుగా డిమాండ్ చేస్తున్నా.. పట్టించుకోకుండా ప్రభుత్వం లైనింగ్ పనులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ పనులు ఆపాల్సిందేనని భీష్మించి కాలువలోనే బైఠాయించారు. లైనింగ్ పనులు ఆపకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హంద్రీనీవా డీఈ వేణుగోపాల్‌రెడ్డి అక్కడికి చేరుకొని వారికి సర్ధిచెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, కార్యదర్శి జంగాల పె ద్దన్న, కమిటీ సభ్యులు వీవీ రమణ, శివన్న, శ్రీరాము లు, నాగిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, నాగేంద్ర, సీఐటియు ఒంట్టెదు వేమన్న, రైతులు పాల్గొన్నారు.