Handriniva శరవేగంగా హంద్రీనీవా విస్తరణ
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:01 AM
ప్రకటించిన విధంగానే హంద్రీనీవా కాలువ విస్తరణ పనులను ప్రభుత్వం పునఃప్రారంభించింది. నీటి ఎత్తిపోతలు నిలిచిన వెంటనే ఈ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం జలవనరుల శాఖను సమాయత్తపరిచింది.

పనులు పునఃప్రారంభం.. మాట నిలుపుకున్న చంద్రబాబు
జూన 12లోగా పూర్తి చేయాలని లక్ష్యం
గుంతకల్లు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రకటించిన విధంగానే హంద్రీనీవా కాలువ విస్తరణ పనులను ప్రభుత్వం పునఃప్రారంభించింది. నీటి ఎత్తిపోతలు నిలిచిన వెంటనే ఈ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం జలవనరుల శాఖను సమాయత్తపరిచింది. మరో 20 రోజులపాటు నీటిని పారించే అవకాశం ఉన్నా, పంటలన్నీ పూర్తికావడంతో ఎత్తిపోతలను గత వారంలో నిలిపివేసింది. విస్తరణ పనులను జగన ప్రభుత్వం ఐదేళ్లపాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా కాలువను వెడెల్పు చేస్తామని, పూర్తి స్థాయిలో సాగునీటిని పారిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులకు శ్రీకారం చుట్టారు. జూన 12 నాటికి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా (తరువాయి 6లో)