Pastor Case Notice: హర్షకుమార్‌కు పోలీసు నోటీసు
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:16 AM
పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో ఆధారాలు సమర్పించేందుకు జీవీ హర్షకుమార్ కు పోలీసు నోటీసు జారీ చేశారు. ఆయన ఈ నెల 2 లోపు ఆధారాలు సమర్పించాలి

పాస్టర్ కేసులో ఆధారాలు ఉంటే సమర్పించండి
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తు అధికారి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌కు నోటీసు జారీ చేశారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మంగళవారం బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 179 కింద పోలీసులు జారీ చేసిన నోటీసును హర్షకుమార్ తీసుకున్నారు. రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో నమోదయిన ప్రవీణ్ కేసు దర్యాప్తులో ఉండగా.. హర్షకుమార్ గత నెల 27న ప్రెస్‌మీట్ పెట్టా రు. ‘ఆ సంఘటన ముమ్మాటికీ హత్యే. ఇది పోలీసుల కు, వైద్యులకు తెలుసు’ అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారి నోటీసు జారీ చేశారు. కేసుకు సంబంధించి ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని దర్యాప్తు అధికారికి ఈ నెల 1 లేదా 2 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఒక నోటీసు ఇచ్చామని, ఇది రెండో నోటీసని పోలీసులు తెలిపారు. దీనిపై హర్షకుమార్ స్పందిస్తూ... ‘పాస్టర్ ప్రవీణ్ కేసుపై నేనే బుధవారం రైట్ టు ఇన్‌ఫర్మేషన్ ప్రకారం సమాచారం అడుగుతా’ అని తెలిపారు.