Andhra Pradesh: 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:07 AM
ఇందుకుగాను రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. రంజాన్ నెలలో సాయం కాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించేందుకు నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ కార్యక్రమాలు
ఇఫ్తార్ ఏర్పాట్లకు రూ.1.50 కోట్లు విడుదల
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. రంజాన్ నెలలో సాయం కాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.75 లక్షలు కేటాయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కూడా 4, 5 రోజుల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ కార్యక్రమాన్ని వారికి అనువైన రోజున కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహించాలని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మరో రూ.75 లక్షల మొత్తాన్ని కేటాయించారు.