రైతులు నమ్మి బకాయిలు చెల్లిస్తే.. మోసగించిన సొసైటీ ఉద్యోగి
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:03 AM
దువ్వ సహకార సంఘం (పీఏసీఎస్) ఉద్యోగి కొప్పిశెట్టి రామ హనుమకుమార్‌పై రైతుల పెట్టుకున్న నమ్మకమే రైతులను నిండా ముంచింది.

తణుకు రూరల్ మార్చి 26 (ఆంధ్రజ్యోతి): దువ్వ సహకార సంఘం (పీఏసీఎస్) ఉద్యోగి కొప్పిశెట్టి రామ హనుమకుమార్‌పై రైతుల పెట్టుకున్న నమ్మకమే రైతులను నిండా ముంచింది. ప్రతీ అవసరానికి అందుబాటులో ఉంటున్నాడనే నమ్మకంతో గ్రామస్తులు అతన్ని సొసైటీ రాముగా పిలిచేవారు. సొసైటీకి చెల్లిం చివలసిన బకాయిలను రైతులు రాము ఫోన్ పే నంబరు ద్వారా చెల్లించేశారు. రెండేళ్లుగా రైతుల సొసైటీ బకాయిల సొమ్ము వసూలు చేసి సొసై టీకి జమ చేయలేదు. పైగా రైతులకు వాట్సాప్ ద్వారా రసీదులు పంపించాడు. ఈ ఏడాది బకాయిలు చెల్లించేందుకు సొసైటీకి వచ్చిన రైతులకు 2023 నాటి బకాయి ఉందని చెప్పడం తో కంగుతిన్నారు. సొసైటీ సిబ్బందిని పలువురు రైతులు నిలనదీయడంతో రాముకు ఫోన్ పే ద్వారా చెల్లించిన మొత్తం సొసైటీలో నమోదు కాలేదని చె ప్పారు. దీనితో మంగళవారం జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో రైతులు అధికారులను నిలదీశారు. సహకార ఉద్యోగిని రైతులు అతిగా నమ్మడం కారణంగానే ఎక్కవగా మోసం జరిగినట్లు పేర్కొన్నారు. కొందరు రైతు లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది. ఎంత మంది రైతుల నుంచి ఫోన్ పే ద్వారా సొమ్ములు తీసుకున్నారో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని రైతులను పర్సన్ ఇన్‌చార్జి పి.వెంకటేశ్వరరావు కోరారు. రైతుల సొమ్ములతో పరారైన ఉద్యోగి ఈనెల 12 వరకూ విధులలో ఉన్నాడని, తర్వాత ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి వుందని సిబ్బంది తెలిపారు. రైతులు మొత్తం రూ. 30 నుంచి 40 లక్షల వరకు అతడికి చెల్లించినట్లు చెబుతున్నారు. అధికారులకు మాత్రం ఇప్పటి వరకూ అందిన ఫిర్యాదుల మేరకు రూ. 14.22 లక్షలు అతడికి చెల్లించినట్లు తేలింది. దీనిపై ఇద్దరి ఫిర్యాదుల ఆధారంగా తణుకు రూరల్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఉన్నతాధికారులు నివేదిక కోరారు
దువ్వ సొసైటీ ఉద్యోగి అవకతవకలపై వారం రోజుల్లో నివేదిక పంపించాలని డివిజనల్ సహ కార అధికారి ఆదేశించారు. మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆం దోళనతో ఉన్నతాధికారులు నివేదికను అందజే యాలని కోరారు. మోసపోయిన సభ్యులు, వారి మొత్తాలు ఇంకా పూర్తి వివరాలు అందవలసి వుంది. అందిన వెంటనే ఉన్నతాదికారులకు నివేదిక అందిస్తాం.
పి.వెంకటేశ్వరరావు, పర్సన్ ఇన్‌చార్జి, సబ్ డివిజనల్ సహకార అధికారి, తణుకు
బకాయి చెల్లించలేదంటున్నారు..
సొసైటీలో రుణం తీసుకుని ఏటా వాయిదా చెల్లిస్తున్నాం. 2023, 2024లో స్టాఫ్ అసిస్టెంట్ రాముకు ఫోన్ పే ద్వారా రూ. 1,25,106 చెల్లించాను. ఈనెల 20న ఈ ఏడాది బకాయి చెల్లించేందుకు వెళితే 2023లో బకాయి కట్టలేదని చెప్పారు. రెండేళ్లుగా నోటీ సులు ఎందుకు ఇవ్వలేదు. మొత్తం వ్యవహారం లో విచారణ జరిపి న్యాయం చేయాలి.
–ఎస్ ఆదిశేషు, బాధితుడు, దువ్వ