Share News

వేగంగా కదలండి.. మార్పు చూపండి

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:21 AM

జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలి. రియల్‌ ఎస్టేట్‌, రిసార్ట్స్‌, హోటల్స్‌ రంగాలతో పాటు, పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలి. బియ్యపుతిప్ప వద్ద హార్బర్‌ ఏర్పాటుకు వున్న సాధ్యా సాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వండి.

 వేగంగా కదలండి.. మార్పు చూపండి
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ నాగరాణి

రాష్ట్ర రహదారులపై దృష్టి సారించాలి

నాలుగు లేన్లుగా తాడేపల్లిగూడెం – లోసరి రోడ్డు నిర్మాణంపై కేంద్రం దృష్టికి

జిల్లాలో తలసరి ఆదాయం పెరగాలి

బియ్యపుతిప్ప హార్బర్‌పై నివేదికకు ఆదేశం

అభివృద్ధే అజెండాగా.. కలెక్టర్‌ నాగరాణి జిల్లా వార్షిక ప్రణాళిక సమర్పణ

తలసరి ఆదాయం పెరగాలి

జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలి. రియల్‌ ఎస్టేట్‌, రిసార్ట్స్‌, హోటల్స్‌ రంగాలతో పాటు, పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలి. బియ్యపుతిప్ప వద్ద హార్బర్‌ ఏర్పాటుకు వున్న సాధ్యా సాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వండి. తాడేపల్లిగూడెం నుంచి లోసరి రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.100 కోట్లు విడుదల చేసింది. అయితే దీనిని నాలుగు లైన్‌ల రహదారి ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్షను కేంద్రం దృష్టికి తీసుకుని వెళతాం. అలాగే ఒకప్పుడు గోదావరి జిల్లాలో తలసరి ఆదాయం ఎక్కువ. ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ఏలూరు జిల్లా రూ.3.80 లక్షలతో ప్రథమ స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి రూ.3.50 లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. దీనిని పెంచాలి.

– ముఖ్యమంత్రి చంద్రబాబు

(భీమవరం/టౌన్‌/నరసాపురం/తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘గోదావరి పుష్క రాలు వస్తున్నాయి. తగు ఏర్పాట్లకు సిద్ధంగా ఉం డండి. టూరిజంతోపాటు ఆక్వా కల్చర్‌ను అభివృద్ధి చేయాలి. మత్య్సకారులను ఇందులో భాగస్వామ్యం చేయాలి. గోదావరి జిల్లాలో పాడి పరిశ్రమ మరిం త పెరగాలి. పశువైద్యశాలల మరమ్మతులు, డిస్పె న్సరీల అభివృద్ధికి నిధులిస్తాం. రోడ్లు అభివృద్ధికి సీ కేటగిరి కింద నిధుల మంజూరు చేస్తాం. అధికార యంత్రాంగం వేగంగా కదలి.. మార్పు చూపించా లి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భాగంగా రెండో రోజై న బుధవారం కలెక్టర్‌ చదలవాడ నాగరాణి జిల్లా అవసరాలు, పురోగతి, ఇతరత్రా అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సీఎంకు వివరిం చారు. జిల్లా ప్రణాళికలో ముఖ్యాంశాలు..

వ్యవసాయంపై దృష్టి : కలెక్టర్‌

జిల్లాలో రూ.29,680 కోట్ల రుణ సదుపాయం అందించేందుకు నిర్ణయించగా వీటిలో 50 శాతం వ్యవసాయ రంగానికి, 50 శాతం మహి ళా పారిశ్రామికీకరణ, సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటు, ఎగుమతి, విద్య, హౌసింగ్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్‌లకు రుణాలు అందిస్తాం.

పశ్చిమలో సాగు సమగ్రాభివృద్దికి సుస్థిర అభి వృద్ధి ప్రణాళిక రూపొందించాం. జిల్లాలో ఇటు వ్యవసాయం, ఉద్యాన సాగు కోసం కొత్త రకాల వంగడాలు వేయనున్నాం. బ్యాంకింగ్‌, వ్యవసా య ఉద్యాన రంగాలపై దృష్టి సారించాం.

జిల్లాలో తీర ప్రాంతం వెంబడి నిర్మించిన 216 జాతీయ రహదారిని నాలుగు లైన్లగా అభివృద్ధి చేస్తున్నాం. దీనికి సంబంధించిన సర్వే సాగుతోంది.

పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 46 కిలోమీటర్ల మేర నాలుగులైన్ల జాతీ య రహదారిని అభివృద్ధి చేసేందుకు రూ.2600 కోట్లతో డీపీఆర్‌ సిద్ధమైంది. భూసేకరణ పను లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదికి సగం పనులు పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నాం.

జిల్లాలో 189 కిలోమీటర్ల ఆర్‌ఆండ్‌బీ రహదా ర్లను వచ్చే ఏడాదికి అభివృద్ధి చేయనున్నాం. ఉండి నియోజకవర్గంలో ఆర్వోబీ రైల్వే వంతెన పనులు సాగుతున్నాయి, భీమవరం, పెద అమిరం వద్ద రైల్వే లెవల్‌క్రాస్‌ గేట్లకు ప్రతిపాదనలు పెట్టాం.

జిల్లాలో సాగు నీటి కాలువల్లో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగి ప్రవాహానికి ఇబ్బందిగా ఉంది. ఈ గుర్రపు డెక్క ఆకును ఎరువుగా మార్చి సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించే అవకాశాలపై దృష్టి సారించాం.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో తలసరి ఆదాయం రూ.3.50 లక్షలు సాధించాలన్నది మా లక్ష్యం.

జిల్లాలో చేపలు, రొయ్యల సాగు 1.33 లక్షల ఎకరాల నుంచి 1.50 లక్షల ఎకరాలకు పెంచే దిశగా పనిచేస్తున్నాం.

పశు వైద్యశాలల భవనాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయించాలి. కొన్నింటిని కొత్తగా నిర్మించాలి.

జిల్లాలో అక్టోబర్‌, డిసెంబరు మధ్య 2,730 మెట్రిక్‌ టన్నుల మినుములు, 21,600 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న, 130 మెట్రిక్‌ టన్నుల వేరుశనగ దిగుబడులు వచ్చేలా సాగుకు ప్రణాళిక రచించాం. ప్రకృతి వ్యవసాయం కింద 50 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టనున్నాం.

జిల్లా సమగ్ర ప్రణాళికలో భాగంగా 612 హెక్టార్లలో ఉద్యాన సాగు పెంచి రైతుల ఆదాయం రెట్టింపు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి 10 వేల యూనిట్ల పాడి పశువులను అందించనున్నాం. వీటిలో మండలానికి 500 యూనిట్ల చొప్పున అందిస్తాం. మండలానికి 50 చొప్పున వెయ్యి గొర్రెలు, మేకల యూనిట్‌లు ఇవ్వనున్నాం.. అని కలెక్టర్‌ వివరించారు.

భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

50 పడకలకు రూ.23.75 కోట్లు

భీమవరం ఏరియా ఆసుపత్రికి

50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను మంజూరు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆయుష్మన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ వైద్యశాలలకు ప్రకటించారు. అందులో ఒకటికి భీమవరానికి దక్కింది.

ఒక్కో యూనిట్‌ రూ.23.75 కోట్లు కేటాయిస్తారు. 50 పడకల బెడ్స్‌తో అత్యాధునిక క్రిటికల్‌ కేర్‌ ఐసీయూ విభాగం ఏర్పాటు కానుంది.

ఈ ఏడాది లక్ష్యాలు

జిల్లాలో ఆక్వా, ఫౌలీ్ట్ర ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 206 కోట్లతో ఎనిమిది యూనిట్ల ఏర్పాటు.

ఎంఎస్‌ఎంఈ పఽథకంలో రూ.ఏడు కోట్లతో 25 ఆహార పరిశ్రమలను వచ్చే అక్టోబరు నాటికి ఏర్పాటు.

ఎనిమిది కోట్లతో ఆరు రీ సైక్లింగ్‌ యూనిట్ల ఏర్పాటు..

స్వయం ఉపాధి పథకంలో భాగంగా ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ ఉపాధి కల్పన(పీఎంఈజీపీ)లో వచ్చే మే నాటికి రూ.100 కోట్లతో 200 యూనిట్ల స్థాపించాలని నిర్ణయం.

Updated Date - Mar 27 , 2025 | 01:21 AM