Share News

AP Market Yard Chairpersons: 47 మార్కెట్‌ కమిటీలకు చైర్మన్ల ప్రకటన

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:44 AM

రాష్ట్ర ప్రభుత్వం 47 మార్కెట్‌ యార్డుల చైర్మన్లను ప్రకటించింది. టీడీపీ 37, జనసేన 8, బీజేపీ 2 స్థానాలు పొందాయి. రిజర్వేషన్, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం, త్వరలో మిగతా నియామకాలు చేయనుంది.

AP Market Yard Chairpersons: 47 మార్కెట్‌ కమిటీలకు చైర్మన్ల ప్రకటన

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీ కార్యక్రమాన్ని మరోసారి చేపట్టింది. ఇప్పటికే అనేక కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం.. తాజాగా వివిధ జిల్లాల్లోని 47 మార్కెట్‌ యార్డులకు చైర్మన్లను శుక్రవారం ప్రకటించింది. చైర్మన్ల నియామకంలో రిజర్వేషన్‌ కేటగిరీలను పరిగణలోకి తీసుకుని, మహిళలకు కూడా ప్రాధాన్యమిస్తూ ఈ జాబితాను విడుదల చేసింది. ప్రకటించిన యార్డు చైర్మన్‌ పదవుల్లో టీడీపీ నుంచి 37 మందికి, జనసేన నుంచి 8 మందికి, బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌, ఇతర డైరెక్టర్ల ప్యానల్‌తో కూడిన నియామక ఉత్తర్వులను రెండు-మూడు రోజుల్లో జారీచేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 218 మార్కెట్‌ యార్డులు ఉండగా, చైర్మన్‌ పదవుల్ని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం నిర్ణయిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మిగతా యార్డు కమిటీలకు త్వరలో చైర్మన్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 04:44 AM