Share News

Breaking News: బాలికను గొంతు కోసి చంపిన కేసులో కోర్టు సంచలన తీర్పు..

ABN , First Publish Date - Apr 01 , 2025 | 08:14 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: బాలికను గొంతు కోసి చంపిన కేసులో కోర్టు సంచలన తీర్పు..
Breaking News

Live News & Update

  • 2025-04-01T14:01:31+05:30

    ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులు: చంద్రబాబు

    • బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పెన్షన్ల పంపిణీ

    • లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించిన చంద్రబాబు

    • లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు

    • కొత్తగొల్లపాలెం టీడీపీకి కంచుకోట: సీఎం చంద్రబాబు

    • ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులు: చంద్రబాబు

    • గతంలో బటన్ నొక్కామని చెప్పారు: సీఎం చంద్రబాబు

    • మీ బటన్లు అన్నీ నా పెన్షన్‌తో సమానం: చంద్రబాబు

    • ప్రజా సేవల పేరుతో పెన్షన్‌ ఇచ్చే కార్యక్రమం చేపట్టా: చంద్రబాబు

    • ముందుండి నడిపించాలనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా: చంద్రబాబు

    • పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలి: చంద్రబాబు

    • ధనిక రాష్ట్రమైన తెలంగాణలో మనకంటే తక్కువ పెన్షన్‌: సీఎం చంద్రబాబు

    • మళ్లీ అమరావతిని గాడిన పెట్టాం: చంద్రబాబు

    • పనులు వేగంగా జరుగుతున్నాయి: చంద్రబాబు

    • విశాఖ స్టీల్ కూడా గాడిలో పడింది: చంద్రబాబు

    • విశాఖ ఉక్కుకు రూ.11 వేల కోట్లు నిధులు తెచ్చాం: చంద్రబాబు

    • విశాఖకు రైల్వే జోన్ కూడా వచ్చింది: చంద్రబాబు

    • ఈనెలలోనే DSC పూర్తి చేసి కొత్త టీచర్లను నియమిస్తాం: చంద్రబాబు

    • ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారు: చంద్రబాబు

    • ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారు: చంద్రబాబు

    • నేను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్లు కళ్లు తెరిచి చూడాలి: చంద్రబాబు

    • 2027కి పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తాం: చంద్రబాబు

  • 2025-04-01T13:06:15+05:30

    బాలిక గొంతు కోసి చంపిన కేసులో కోర్టు సంచలన తీర్పు..

    • అనకాపల్లి: చోడవరం కోర్టు సంచలన తీర్పు

    • దేవరాపల్లికి చెందిన శేఖర్‌కు మరణశిక్ష విధించిన కోర్టు

    • నిందితుడికి మరణశిక్ష విధించిన జిల్లా జడ్జి రత్నకుమార్‌

    • 2015లో ఏడేళ్ల బాలికను గొంతుకోసి చంపిన నిందితుడు శేఖర్‌

  • 2025-04-01T13:00:03+05:30

    హెచ్‌సీయూ భూములపై రాజ్యసభలో చర్చ..

    • ఢిల్లీ: రాజ్యసభ జీరో అవర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశాన్ని లేవనెత్తిన ఎంపీ లక్ష్మణ్

    • హెచ్‌సీయూకి చెందిన 400 ఎకరాలను టీజీఐఐసీ వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం చూస్తోందన్న ఎంపీ

    • విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని సంరక్షించడం, ఆక్రమణలను నివారించడంపై చర్యలు తీసుకోవాలన్న ఎంపీ లక్ష్మణ్

    • సరిహద్దు గోడ నిర్మాణాన్ని సులభతరం చేయడానికి సరిహద్దులను గుర్తించాలని రాజ్యసభలో మాట్లాడిన ఎంపీ లక్ష్మణ్

  • 2025-04-01T11:36:24+05:30

    హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద గందరగోళం..

    • హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త

    • యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులు

    • యూనివర్సిటీ భూములు వేలం వెయ్యెుద్దంటూ విద్యార్థులు ఆందోళన

    • తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

    • పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న విద్యార్థులు

    • భూములు వేలంపై ప్లకార్డులు పట్టి నిరసన తెలుపుతున్న విద్యార్థులు

    • ఇంచు భూమి కూడా వదులుకోమంటూ పెద్దఎత్తున నినాదాలు

    • ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన విద్యార్థులు

    • పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • 2025-04-01T11:20:09+05:30

    రఘురామ టార్చర్ కేసు.. డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

    • ఢిల్లీ: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ టార్చర్ కేసులో విచారణకు హాజరుకావాలన్న సుప్రీంకోర్టు

    • ఈనెల 7, 8 తేదీల్లో విచారణకు హాజరు కావాలంటూ డాక్టర్ ప్రభావతిని ఆదేశించిన సుప్రీంకోర్టు

    • విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దవుతుందని తేల్చి చెప్పిన ఉన్నత న్యాయస్థానం

    • డాక్టర్ ప్రభావతి విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా

    • దీనికి సంబంధించిన సాక్ష్యాలను సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుంచిన సిద్ధార్థ లూత్రా

    • ఈ మేరకు తప్పని సరిగా విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం

  • 2025-04-01T10:45:18+05:30

    నల్లమల అడవుల్లో కార్చిచ్చు.. కాలిపోతున్న వృక్ష సంపద..

    • కర్నూలు: ఓర్వకల్లు, పాన్యం మండలాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు

    • బ్రాహ్మణపల్లి తాండా సమీపంలో ప్రమాదవశాత్తూ చెలరేగిన మంటలు

    • బ్రాహ్మణపల్లి తాండా నుంచి పిన్నాపురం, సోమయాజులపల్లి వరకూ వ్యాపించిన మంటలు

    • స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్ని్మాపక సిబ్బంది

    • మంటల్లో కాలి బూడిదవుతున్న వందలాది వృక్షాలు

  • 2025-04-01T10:16:34+05:30

    ఇంట్లోకి దూరిన చిరుతపులి..

    • కామారెడ్డి: జిల్లాలో కలకలం రేపుతున్న చిరుతపులి

    • దేవునిపల్లిలోకి వచ్చి ఓ ఇంట్లో దూరిన చిరుతపులి

    • అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

    • చిరుతను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన అధికారులు

    • ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించిన పోలీసులు

  • 2025-04-01T10:10:26+05:30

    చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు..

    • శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలంలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

    • మంచినీళ్లపేట నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు

    • ఇవాళ ఉదయం సముద్రపు కెరటాల తీవ్రతకు బోల్తాపడిన బోటు

    • ఐదుగురిలో ఇద్దరు గల్లంతు, ఒడ్డుకు చేరిన మరో ముగ్గురు మత్స్యకారులు

    • బుంగ ధనరాజు, వంక కృష్ణ అనే మత్స్యకారులు గల్లంతు

    • ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష

    • గల్లంతైన వారి కోసం రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు

  • 2025-04-01T09:47:40+05:30

    దారుణం.. జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్..

    • హైదరాబాద్: మహానగరంలో విదేశీయురాలిపై గ్యాంగ్ రేప్

    • మీర్పేట్ వద్ద లిఫ్ట్ ఇస్తామని యువతిని తీసుకెళ్లిన యువకులు

    • పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన కామాంధులు

    • విదేశీయురాలిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డ కేటుగాళ్లు

    • అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

    • లైంగిక దాడికి గురైన యువతిని జర్మనీ దేశస్థురాలుగా గుర్తింపు

    • తనపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన యువతి

    • ఘటనపై కేసు నమోదు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు

    • ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

  • 2025-04-01T09:33:07+05:30

    కేసీఆర్ చేసిందే.. రేవంత్ రెడ్డీ చేస్తున్నారు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • కోర్టు తీర్పు పేరుతో విలువైన భూములను అమ్మేస్తారా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • అమ్మిన భూమిని తిరిగి తీసుకువస్తారా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు భూములు అమ్మేస్తారా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలంటే అప్పులు చేయవచ్చు, మరేదైనా మార్గంలో తెచ్చుకోవచ్చు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • భూముల కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్న విద్యార్థులను అమానుషంగా అరెస్టు చేస్తున్నారు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్మితే రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • నేడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

  • 2025-04-01T09:24:05+05:30

    హెచ్‌సీయూ భూముల వివాదం.. నేడు పెద్దఎత్తున ఆందోళనలు..

    • హైదరాబాద్: హెచ్‌సీయూ భూములపై కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

    • ఇవాళ తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల నేతలు

    • భూముల కాపాడేందుకు నిరసనలు ఉధృతం చేయాలని విద్యార్థులు నిర్ణయం

    • ఈరోజు వర్సిటీకి వెళ్లనున్న బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం

    • హెచ్సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ

    • 400 ఎకరాల భూమి విషయంలో కొనసాగుతున్న వివాదం

    • హెచ్సీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపు

  • 2025-04-01T08:26:48+05:30

    బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. వివరాలు ఇవే..

    • అమరావతి: బాపట్ల జిల్లాలో నేడు పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

    • పర్చూరు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు

    • చిన్నగంజాం మం. గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి

    • పెన్షన్ల పంపిణీ అనంతరం టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్న చంద్రబాబు

  • 2025-04-01T08:14:11+05:30

    ముగ్గురు యువకులపై కత్తితో దాడి.. పరిస్థితి దారుణం..

    • కడప: కమలాపురంలో యువకుల మధ్య ఘర్షణ

    • ముగ్గురిపై కత్తితో దాడి చేసిన సల్మాన్ అనే యువకుడు

    • ఇద్దరి యువకులకు తీవ్రగాయాలు, రిమ్స్‌కు తరలింపు

    • ద్విచక్రవాహనం వేగంగా నడపవద్దని సల్మాన్‌ను మందలించిన సోహెల్, రియాజ్, షాబాజ్

    • తనను హెచ్చరించడం నచ్చక కత్తితో దాడికి తెగబడిన సల్మాన్