Share News

Supreme Notice To Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు సుప్రీం షాక్

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:33 PM

Supreme Notice To Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ పిటీషన్‌కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్‌కు నోటీసులు ఇచ్చింది ధర్మాసనం.

Supreme Notice To Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు సుప్రీం షాక్
Supreme Notice To Sanjay

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు (Former CID Chief Sanjay) సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం (AP Govt) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈరోజు (మంగళవారం) విచారించింది. సంజయ్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్‌కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలంటూ.. తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.


గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే అంశాలను సుప్రీం కోర్టు ముందు ఏపీ ప్రభుత్వం ఉంచింది. సంజయ్‌పై అప్పట్లోనే అవినీతి నిరోధక చట్టంలో పలు సెక్షన్ల కింద ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌‌ను ఏసీబీ చేర్చింది. ఫైర్ డీజీగా విధులు నిర్వహించిన సమయంలో సంజయ్ ఈ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత సంజయ్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తరువాత నివేదికను ఏసీబీకి పంపించింది. ప్రాథమిక సాక్షాధారాలు ఉండటంతో సంజయ్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Supreme Court Order: ఆర్‌ఆర్‌ఆర్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు


అగ్నిమాపక శాఖలో ఆన్‌లైన్‌లో ఎన్‌వోసీలు జారీ చేసేందుకు అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్‌ అప్పగించారు. అయితే అక్కడ ఎలాంటి పనులు జరగలేదు. కానీ ఆ సంస్థకు రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపైన దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించేందుకు నిర్వాహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు కేటాయించి.. అందుకు రూ.1.19 కోట్లు ఇచ్చారు. ఈ సదస్సులు మొత్తం కూడా సీఐడీ అధికారులే నిర్వహించారు. అయితే అసలు క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ సదస్సు నిర్వహించనప్పటికీ బిల్లుల పేరిట చెల్లించారు, దొంగల లెక్కలు చూపించారంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇవ్వగా.. ఆ నివేదిక ఆధారంగా సంజయ్‌పై అధికార దుర్వినియోగం, అవినీతి కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ కేసులోనే సంజయ్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 12:55 PM