Share News

Bird Flu in AP: ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:38 AM

కాకినాడ జిల్లా చెందిన చందుర్తి, పిఠాపురం ఫారాల్లో కోళ్లు బర్డ్‌ఫ్లూ కారణంగా చనిపోయినట్లు నిర్ధారించబడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో కోళ్ల రవాణాకు ఆంక్షలు విధించింది

Bird Flu in AP: ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

  • చెందుర్తి, పిఠాపురం ఫారాల్లోని కోళ్లకు వైరస్‌ నిర్ధారణ

  • నేడు నరసరావుపేటకు ఐసీఎంఆర్‌ బృందం

పిఠాపురం/గొల్లప్రోలు రూరల్‌, అమరావతి, మంగళగిరి, గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా చెందుర్తి, పిఠాపురం ఫారాల్లోని కోళ్లు బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్లే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అధికారిక సమాచారం వచ్చింది. ఇదే విషయాన్ని గెజిట్‌లో ప్రచురించిన ప్రభుత్వం సదరు కోళ్లు చనిపోయిన ఫారాల నుంచి కి.మీ. వరకు ఇన్‌ఫెక్టెడ్‌ జోన్‌గా, 10కి.మీ. పరిధిని సర్వైలెన్స్‌ జోన్‌గా ప్రకటించింది. గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ శివార్లలో పుష్కర కాలువ గట్లపై ఉన్న బోనబోయిన కృష్ణకు చెందిన ఫారంలో ఫిబ్రవరి 15 నుంచి మూడు రోజల వ్యవధిలో 15 వేలకు పైగా కోళ్లు చనిపోయాయి. పిఠాపురంలోని కోళ్లఫారంలోనూ వేలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఇవన్నీ బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయని భావించినప్పటికీ అధికారులు అధికారికంగా నిర్ధారించలేదు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆ శాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంప గా రెండు కోళ్ల ఫారాల్లో చనిపోయిన కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చెందుర్తి, పిఠాపురం ప్రాంతాల నుంచి కోళ్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంపై ఆంక్షలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా, ఇటీవల బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందిన ఆరు జిల్లాల్లోని వ్యాధి నిర్ధారిత ప్రాంతాలను అంటు వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. బర్డ్‌ ఫ్లూ సంభవించిన ప్రదేశాలకు 1-10 కి.మీ. వరకు నిఘా మండలాలుగా ప్రకటించింది. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌, కర్నూలు జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ గుర్తించిన గ్రామాల వివరాలతో ఈ గెజిట్‌ విడుదల చేసింది.


బర్డ్‌ఫ్లూపై సీఎం సమీక్ష

నరసరావుపేటలో బర్డ్‌ ఫ్లూతో రెండేళ్ల బాలిక మృతి చెందడం, అనంతర పరిణామాలపై సీఎం చంద్రబాబు అధికారులతో గురువారం సమీక్ష జరిపారు. బాలిక కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు సీఎంకు చెప్పారు. ఆ ప్రాంతంలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదన్నారు. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలులో ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేసినట్లు తెలిపారు. కాగా, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) బృందం గురువారం మంగళగిరి ఎయిమ్స్‌లో పర్యటించి బాలిక మృతి పై విరరాలు అడిగి తెలుసుకుంది. ఈ బృందం శుక్రవారం నరసరావుపేటలో పర్యటించనుంది.


ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 05:38 AM