Share News

CM ChandraBabu : విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:15 PM

CM ChandraBabu : చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ సమాావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యుత్ ఛార్జీలపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే మంత్రులుకు పలు కీలక సూచనలు చేశారు.

CM ChandraBabu : విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

అమరావతి, ఫిబ్రవరి 06: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక ఆదేశాలను ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సీఎం ఇచ్చినట్లు సమాచారం. 2019కు ముందు నీరు చెట్టు కింద ఉన్న నిధులు సుమారు రూ. 900 కోట్లు క్లియర్ చేయాలంటూ ఉన్నతాధికారులకు సిఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే 2019కి ముందున్న ఇళ్ళ బకాయిలు కూడా క్లియర్ చేయాలిని సూచించారు. ఈ బకాయిల కోసం పలువురు కార్యకర్తలు, నాయకులు మన చుట్టు తిరుగుతున్నారని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే ఇన్‌ఛార్జ్ మంత్రులు.. జిల్లాలకు వెళ్ళినప్పుడు వీటిపై దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇక ఈ సదస్సులో రెవిన్యూ‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎవరైనా పనుల కోసం వచ్చినప్పుడు వారికి తేలికగా పనులు అయ్యే విధంగా చూడాలని మంత్రులకు సూచించారు. అదే విధంగా బోగస్ పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై మంత్రులు, అధికారులు దృష్టి పెట్టాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు. అలాగే రెనువబుల్ ఎనర్జీ‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో మనం గ్రౌండింగ్ మీద దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అనంతపురం జిల్లాలో కస్టమ్స్ విభాగం.. ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుపై దృష్టి పెట్టమని వెల్లడించారుు.


మన అధికారులకు సైతం ట్రైనింగ్ అవసరం ఉందన్నారు. ఇక్కడ కూడా మనం ఒక ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పారు. అధికారులు సైతం ఎప్పటికప్పుడు అప్టేడ్ కావడానికి అవకాశం ఉంటుందన్నారు. సూర్య గర్, కుసుమ పథకాలు తీసుకొచ్చామన్నారు. వాటి ద్వారా మనకు కొంత వరకు విద్యుత్ వస్తుంది... మనం వీటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని తెలిపారు.

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి


విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మనం పని చేయాల్సి ఉందన్నారు. డీఆర్‌సీ మీటింగ్‌లు రెగ్యులర్‌గా పెట్టాల్సి ఉందని చెప్పారు. మనకు రావాల్సిన నగదు ఏమిటో ఆ మీటింగుల్లో తెలుసుకోండన్నారు. లిక్కర్‌పై మనం14 శాతం కమిషన్‌పై చర్చ జరిగిందని.. దీనిపై వ్యాపారులకు కూడా నష్టం కలుగకుండా చూసేందుకు మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి సమావేశం కావాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆదేశించారు.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Feb 06 , 2025 | 04:16 PM