Share News

అభివృద్ధి పండుగ

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:37 AM

శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో అధికారిక పర్యటనకు వచ్చిన కొణిదల నాగబాబు శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవతో నిధులు మంజూరై పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అభివృద్ధి పండుగ
తహసీల్దారు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు, చిత్రంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్‌, జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి, కలెక్టర్‌

  • పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగబాబు

  • తహసీల్దారు కార్యాలయం, యూపీహెచ్‌సీ ప్రారంభం

పిఠాపురం/గొల్లప్రోలు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో అధికారిక పర్యటనకు వచ్చిన కొణిదల నాగబాబు శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవతో నిధులు మంజూరై పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గొల్లప్రోలు పట్టణంలో రూ88.98లక్షలతో నిర్మించిన అర్బన్‌హెల్త్‌సెంటర్‌ భవనాన్ని శాసనమండలి ప్రభుత్వ విప్‌ పిడుగు హ రిప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసి న సౌకర్యాలను, ల్యాబ్‌, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. కోటి రూపాయిలతో నిర్మించిన తహసీల్దారు కార్యాలయ భవనాన్ని నాగబాబు ప్రారంభించారు. కార్యాలయంలోని తహసీల్దారు సీటులో తహసీల్దారు సత్యనారాయణను కూర్చొబెట్టి అభి నందించారు. గొల్లప్రోలు వాటర్‌వర్క్స్‌లో రూ.65.24లక్షలతో నిర్వహించిన పనులను ప్రారంభించి తాగునీటి పథకం పనితీరుపై ఆరాతీశారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి మెయిన్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌ను ప్రారంభించా రు. మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. క్యాంటీన్‌లో పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించారు. కార్యక్రమాల్లో ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయకుమార్‌, కౌడా చైర్మన్‌ తుమ్మలబాబు, జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌, ఎస్పీ బిందుమాధవ్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు పాల్గొన్నారు. కార్యక్రమానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ హాజరుకాలేదు. కార్యక్రమానికి వచ్చిన టీడీపీ నేతలు నాగబాబుకు అన్నక్యాంటీన్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలకడం గమనార్హం.

Updated Date - Apr 05 , 2025 | 01:37 AM