Share News

1.5 కిలోల గంజాయి స్వాధీనం: ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:40 AM

ఐరాల మండలం గుండ్లపల్లె వద్ద గురువారం 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ నరసింహులు తెలిపిన వివరాల మేరకు.. గుండ్లపల్లె బస్టాప్‌ వద్ద గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

1.5 కిలోల గంజాయి స్వాధీనం: ముగ్గురి అరెస్టు
ఐరాల పోలీ్‌సస్టేషన్‌లో నిందితులు

ఐరాల, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఐరాల మండలం గుండ్లపల్లె వద్ద గురువారం 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ నరసింహులు తెలిపిన వివరాల మేరకు.. గుండ్లపల్లె బస్టాప్‌ వద్ద గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో పోలీసులు దాడి చేశారు. గుండ్లపల్లె ఎస్టీ కాలనీకి చెందిన ఆర్‌.మంగమ్మ, మైథిలి, రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చిత్తూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించారు. గంజాయి రవాణా, విక్రయాలపై సమాచారం తెలిస్తే 94407 96722 నెంబరుకు ఫోన్‌ చేయాలని ప్రజలకు ఎస్‌ఐ సూచించారు.

Updated Date - Apr 04 , 2025 | 01:40 AM