వరసిద్ధుడికి కానుకగా వెండి ఊయల
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:45 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పవళింపు సేవకు వినియోగించే వెండి ఊయలను సోమవారం హైదరాబాదుకు చెందిన రాధిక, హరికృష్ణలు కానుకగా అందించారు.

ఐరాల(కాణిపాకం), మార్చి 31 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పవళింపు సేవకు వినియోగించే వెండి ఊయలను సోమవారం హైదరాబాదుకు చెందిన రాధిక, హరికృష్ణలు కానుకగా అందించారు. 7.5 కిలోల బరువున్న ఈ ఊయల రూ.8,00,000 విలువ చేయనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. దాతలకు స్వామి దర్శన ఏర్పాట్లు చేసి, శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈవో రవీంద్రబాబు, ఆలయ మాజీ చైర్మన్ మోహన్‌రెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.