స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేయండి
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:44 AM
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
తిరుపతి(ఆటోనగర్), మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మీటర్ రీడర్స్ సమస్యలపై సదరన్ డిస్కం కార్యలయం ఎదుట గురువారం చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు అమర్చడానికి అదానీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ హామీని వెంటనే అమలు చేయకపోతే వేలాది మంది మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. స్మార్ట్ మీటర్లు అమరిస్తే రాష్ట్ర ప్రజలపై లక్షా పదివేల కోట్ల రూపాయలు భారం పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని విస్తృతంగా ప్రోత్సహించాలన్నారు. అంతకుముందు బైరాగిపట్టెడలోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి సదరన్ డిస్కం కార్పొరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.మురళి, విశ్వనాథ్, రాధాకృష్ణ, చిన్నం పెంచలయ్య, సురే్‌షబాబు, జయమణి, హజరత్‌వలీ, రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు.