సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:27 AM
రాష్ట్ర ప్రభుత్వంపై, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్‌పై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేయడంపై టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరుపార్టీల కార్యకర్తలు గాయపడ్డారు.‘

టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ
పరామర్శించిన ఆయా పార్టీల నేతలు
చిత్తూరు అర్బన్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వంపై, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్‌పై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేయడంపై టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరుపార్టీల కార్యకర్తలు గాయపడ్డారు.‘2029 ఎన్నికల కౌంటింగ్‌లో టీవీ స్ర్కీన్‌పై వైసీపీ 89 మ్యాజిక్ ఫిగర్ దాటిందని స్ర్కోలింగ్ పడిన మరుక్షణం జరగబోయే జాతర పుష్ప-2 క్లైమాక్స్‌కు మించి ఉంటుంది. ఆ రోజున వైసీపీ కార్యకర్తలను ఎందుకు టచ్ చేసామా అని గుక్కపెట్టి ఏడుస్తారు. అప్పటి వరకు అనుభవించండి’ అని రెండు రోజుల కిందట నగరంలోని 5వ డివిజన్ వైసీపీ ఇన్‌ఛార్జి మురళీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌పై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలకు శుక్రవారం రాత్రి మురళీరెడ్డి వ్యంగ్యంగా ఫోన్‌లో సమాధానమివ్వడంతో వివాదం చోటు చేసుకుంది. కొంత మంది టీడీపీ కార్యకర్తలు కొంగారెడ్డిపల్లెలో నివాసముంటున్న మురళీరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ప్రశ్నించారు. దాంతో వారి మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలవ్వగా, వైసీపీ కార్యకర్త మురళీరెడ్డికి గాయమైంది.ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని కేసు నమోదు చేయాలని డిమాండు చేయగా పోలీసులు సరేనన్నారు. శనివారం ఎమ్మెల్యే జగన్మోహన్,డిప్యూటీ మేయర్ రాజే్‌షకుమార్‌రెడ్డి, ఇతర నేతలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి గాయపడిన ఇద్దరు కార్యకర్తలను పరామర్శించారు. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి, విజయానందరెడ్డి గాయపడిన వైసీపీ కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఈ ఘటనకు సంబంధించి టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయానందరెడ్డి, మురళీరెడ్డిలపై ఓ కేసు నమోదు చేయగా.. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో టీడీపీ కార్యకర్తలు దిలీప్, సంతో్‌షలపై కేసు పెట్టారు. అలాగే గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలో విజయానందరెడ్డితో పాటు మరో 16 మందిపై రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ మూకల అల్లర్లు :టీడీపీ
చిత్తూరు రూరల్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): చిత్తూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ మూకలు అల్లర్లు సృష్టిస్తున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ ఆరోపించారు. 10 నెలలుగా టీడీపీ పాలనలో చిత్తూరు ప్రశాంతంగా వుందన్నారు.ఆ ప్రశాంతతను పాడు చేసే విధంగా వైసీపీ సోషల్‌మీడియాలో కొంతమంది తనతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకే్‌షలపై అసభ్యంగా ట్రోల్ చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.ఆ వీడియోలపై పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదన్నారు.టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీఆర్ రాజన్, మేయర్ అముద, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, టీడీపీ సీనియర్ నాయకులు చంద్రప్రకాష్, దొరబాబు, కాజూరు బాలాజి తదితరులు పాల్గొన్నారు.