Share News

Vinukonda: వినుకొండ కాలనీలకు మహర్దశ

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:49 AM

వినుకొండ మున్సిపాలిటీలో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంతో పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.62.60 లక్షలతో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.

Vinukonda: వినుకొండ కాలనీలకు మహర్దశ

‘ఆంధ్రజ్యోతి’ అక్షరం అండగా.. పరిష్కారం దిశగా

రూ.62.60 లక్షల పనులకు చీఫ్‌ విప్‌ జీవీ శంకుస్థాపనలు

వినుకొండ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం సత్పలితాలను ఇస్తోంది. ఫలితంగా పలు కాలనీలకు మహర్దశ పట్టనుంది. ఆయా కాలనీల్లో ప్రగతి పనులకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు మంగళవారం శంకుస్థాపనలు చేశారు. రూ.62.60 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు.. మురుగు కాల్వల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. జనవరి 28న గాయత్రినగర్‌.. కొట్నాల్చ వీధిలో ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులుకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. స్పందించిన జీవీ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కొట్నాల్చ వీధిలో రూ.17.60 లక్షలతో సీసీ రోడ్లు.. మురుగు కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గాయత్రినగర్‌లో రూ.45 లక్షలతో ప్రజలు కోరిన విధంగా సిమెంట్‌ రోడ్లు.. మురుగు కాల్వల నిర్మాణానికి మంగళవారం జీవీ శంకుస్థాపన చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ వేదికగా ప్రజలు కోరిన అభివృద్ధి పనులకు ఇచ్చిన హామీల మేరకు పనులు చేపట్టడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అధికారులు, పాలకులకు మధ్య వారధిగా కాలనీల్లో అభివృద్ధి పనులకు ‘ఆంధ్రజ్యోతి’ కృషి చేసిందని వారు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండలో ‘ఆంధ్రజ్యోతి’ అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని జీవీ ఆంజనేయులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పనులు చేపట్టేందుకు కోడ్‌ పూర్తయ్యే వరకు ఆగాల్సి వచ్చిందన్నారు. వినుకొండ మున్సిపాలిటీలో రూ.161 కోట్లతో రక్షిత నీటి పథకం విస్తరణ చేపట్టి తాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:49 AM