Share News

Andhra Pradesh Heatwave: సుర్రుమన్న సూరీడు

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. శుక్రవారం 181 ప్రాంతాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం, కడప, నంద్యాల, తిరుపతి సహా పలు జిల్లాల్లో అత్యధికంగా 42.6°C వరకూ నమోదైంది. వడగాడ్పుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Andhra Pradesh Heatwave: సుర్రుమన్న సూరీడు

181 ప్రాంతాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు

నేడు కోస్తాంధ్రలో వడగాడ్పుల ప్రభావం

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాలో వడగాడ్పులు సెగలు పుట్టిస్తున్నాయి. శుక్రవారం 181 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 మండలాల్లో తీవ్రంగా, 90 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. గరిష్ఠంగా ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6, నంద్యాల జిల్లా ఆలమూరులో 42.5, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.1, అన్నమయ్య జిల్లా వతలూరులో 42, అనంతపురం జిల్లా గుంతకల్లు, పల్నాడు జిల్లా నడికుడిలో 41.9, విజయనగరం జిల్లా నెలివాడలో 41.8, నెల్లూరు జిల్లా నెల్లూరిపాలెలో 41.5, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.1 డిగ్రీలు నమోదయ్యాయి. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 35 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు 223 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం 85 మండలాల్లో వాటి ప్రభావం ఉంటుందని పేర్కొంది.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 04:26 AM